AP ZP Chairman Reservations: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఇప్పుడు జెడ్పీ ఛైర్మన్ల వంతైంది. తాజాగా రాష్ట్రంలోని 28 జిల్లాల జడ్పీ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వం చెబుతున్నట్లుగానే 50 శాతం అంటే 14 చైర్పర్సన్ స్థానాలను మహిళలకు కేటాయించింది. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-1994 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్-అన్ రిజర్వ్డ్ విభాగాల మహిళలకు పదవులు కేటాయించారు. 8 జిల్లాలను జనరల్ మహిళలకు కేటాయించారు.
అందులో 3 జిల్లాలు బీసీ మహిళలకు, 2 జిల్లాలు ఎస్సీ మహిళలు, ఓ జిల్లాను ఎస్టీ మహిళకు కేటాయించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన డేడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో బీసీల రిజర్వేషన్ను 23 శాతంగా ఉంది.
28 జిల్లాల్లో 7 స్థానాలను బీసీలకు కేటాయించింది ప్రభుత్వం. దీనిద్వారా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా బీసీలకు రాజకీయ భాగస్వామ్యం లభించింది. ఎస్సీలకు-5, ఎస్టీలకు-3 స్థానాలు కేటాయించారు. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూనే సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమవుతోంది.
ALSO READ: జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?
28 జెడ్సీ పీఠాలకు జనరల్కు-7, మహిళలు-7, బీసీలకు 6, ఎస్సీ-5, ఎస్టీ-3 ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాల్లో ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దాం.
శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు పీఠాలు బీసీలకు కేటాయించారు.
జనరల్ కేటగిరి కింద నెల్లూరు, అన్నమయ్య, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయి.
అన్రిజర్వ్డ్ కేటగిరీలో మహిళలకు కృష్ణా, పల్నాడు, తూర్పుగోదావరి, బాపట్ల, కాకినాడ, చిత్తూరు, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఎస్సీ
మహిళలకు తిరుపతి, గుంటూరు, కోనసీమ ఉండగా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఎస్టీలకు పోలవరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఉన్నాయి.