Illu Illalu Pillalu Today Episode October 14th: నర్మదాసాగర్ల పెళ్లిరోజు వేడుకలను ఘనంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తారు. అంతా వచ్చి సిద్ధంగా ఉన్నా కూడా రామరాజు గదిలో కూర్చొని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే చందు నేను వెళ్లి నాన్నని తీసుకొని వస్తాను అని వెళ్తాడు చందులు చూసిన రామరాజు ఇంకాస్త కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు పదే పదే నాకు క్షమాపణ చెప్పొద్దు నాన్న నా జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అంతేగాని నా గురించి మాత్రం అస్సలు బాధపడొద్దు నాన్న నేను బాగానే ఉన్నాను అని చందు అనగానే రామరాజు ఎమోషనల్ అయిపోతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వల్లి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటారు. ఇక నర్మదా సాగర్ల పెళ్లిరోజు గురించి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సందడిగా ఉంటారు.
ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కలిసి సాగర్ నర్మదల పెళ్లిరోజుని చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు. అందరూ సరదాగా ఉన్నా కూడా నర్మద మాత్రం బాధపడిపోతూ ఉండడంతో అందరూ కాస్త నవ్వచ్చు కదా ఈరోజు మీ పెళ్లి రోజు కదా అని ఎంతగా అడుగుతున్నా సరే నర్మద మాత్రం అస్సలు నవ్వకుండా ఉంటుంది. ఇక తిరుపతి సుకన్య కలిసి నర్మదని నవ్వించే ప్రయత్నం చేస్తూ డాన్సులతో అదరగొట్టేస్తుంటారు. ఇల్లంతా నర్మదా సాగర్ల పెళ్లిరోజు సందర్భంగా హడావిడిగా సందడిగా ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా ఉండడం చూసిన భద్ర నవ్వుకోండి ఈ నవ్వులు మరికాసేపట్లో దూరమవుతాయి అంటూ అనుకుంటుంది. పాతికేయలు నా పగ ఇప్పుడు తీరిపోతుంది అని భద్ర చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు ఇంటికి పోలీసులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే వచ్చిన ఆ లేడీ ఎస్సై శ్రీవల్లి రామరాజు వేదవతి చంద్రులపై కేసు పెట్టింది. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.
పెళ్లిరోజు సందర్భంగా అందరూ చాలా సంతోషంగా ఉంటుండగా సడన్గా పోలీసులు ఇంట్లోకి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.. అసలు మన ఇంటికి పోలీసులు ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే పోలీసులు శ్రీవల్లి కేసు పెట్టింది మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పడంతో ఇంట్లోని వాళ్లందరి సంతోషం ఆవిడవడంతో పాటుగా ఒక్కసారిగా షాక్అవుతారు.. శ్రీవల్లి మోసగత్త ఎన్నో మోసాలు చేసింది అలాంటిది మా మీద కేసు పెట్టిందా అని పోలీసులను అడుగుతారు రామరాజు వేదవతి. కానీ పోలీసులు మాత్రం అస్సలు వినకుండా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. అందరూ కూడా వాళ్లని అరెస్ట్ చేశారని చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే రామరాజు కూతురు లాగా చూసుకున్న కోడలు తనపై కేసు పెట్టిందని చాలా బాధపడిపోతూ ఉంటాడు..
రామరాజు వేదవతిని అలాగే చందు ని పోలీసులు తీసుకుని రావడం చూసిన భద్రాసేన ఇద్దరు కూడా పగలబడి నవ్వుకుంటారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎంత అవమానం ఏదో నేరం చేసి వెళ్లారని అందరూ అనుకుంటారు. మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్లారు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు అని అవమానించేలా మాట్లాడుతారు. అయితే మేమే తప్పు చేయలేదు మాకెందుకు శిక్ష పడుతుంది అని వేదవతి అంటుంది కానీ పోలీసులు మాత్రం అసలు వినకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అది చూసి అందరూ బాధపడిపోతూ ఉంటారు. మొత్తానికి శ్రీవల్లి ప్లాను సక్సెస్ అవుతుంది.
శ్రీవల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు పిలవగానే తనని బాతులు పెట్టి నానా హింసలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు అని పోలీసులకు నాటకాలు మొదలుపెట్టి చెప్తారు. మమ్మల్ని రోజూ గృహహింస కింద హింసిట్స్ తో ఉంటారు అని భాగం కూడా చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నర్మదా మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్లే అంత మోసం చేశారు అని ఎంత చెప్తున్నా సరే పోలీసులు మాత్రం భాగ్యం వాళ్ళ మాటలు నమ్మి రామరాజు చందు వేదవతిని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తారు. ఇక మొత్తానికి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఇలాంటి శిక్ష వేయండి అని ఎంత చెప్తున్నా సరే రామరాజు వేదవతిని కూడా సెల్లో వేస్తారు పోలీసులు.
బెయిల్ కోసం వెళ్ళిన ధీరజ్ లాయర్ ను కలిసి తనని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. వల్లి పెట్టిన కేసులు అలా ఉండడంతో లాయర్ చెక్ చేసి వేలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం వల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నర్మదా బల్లి చేసిన పనుల గురించి బయట పెట్టాలి అని అనుకుంటుంది. సాక్షాలతో సహా తీసుకుని వచ్చి వల్లి బాగోతాన్ని అందరికీ చూపించాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి చేసిన మోసాలు బయట పడతాయా లేదా అన్నది చూడాలి..
Also Read :బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..