BigTV English

AP Weather Update: వామ్మో ఎండలు.. ఏపీలో ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక

AP Weather Update: వామ్మో ఎండలు.. ఏపీలో ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక

AP Heat Wave Weather Today: ఏపీలో ఎండలు, వేడి గాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది. ఇక గతవారం నుంచి 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజులు తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రాకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


రేపు శ్రీకాకుళం జిల్లాలోని 17 మండలాలు, విజయనగరంలోని 21 మండలాలు, పార్వతీపురంమన్యం 12 మండలాలు, అల్లూరి 6, ఏలూరు1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.. మరోవైపు పలు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ మాస్టర్ ప్లాన్, హామీల మాటేంటి?


శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి, వైఎస్సార్ జిల్లా, విజయనగరం, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, ఏలూరు, అన్నమయ్య జిల్లా ఇలా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని.. వృద్దులు, గర్భిణీలు స్త్రీలు, బాలింతలు, వేసవి సెలవులు కావడంతో చిన్న పిల్లలను బయటకు పోనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS , ఇంట్లో తయారుచేసిన లస్సీ, పండ్ల రసాలు, లెమన్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మొదలైనవి త్రాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×