BigTV English
Advertisement

Tension at Tadipatri Poling Booth: రణరంగంగా తాడిపత్రి, రాళ్లు దాడి, పోలీసులకు గాయాలు!

Tension at Tadipatri Poling Booth: రణరంగంగా తాడిపత్రి, రాళ్లు దాడి, పోలీసులకు గాయాలు!

High Tension at Tadipatri Poling Booth, YSRCP Vs TDP Stone Pelting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రణరంగంగా మారింది.


వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలింగ్ బూత్‌కు ఒకేసారి వచ్చారు. దీంతో నేతల మద్దతుదారులు, పార్టీల కార్యకర్తలు రోడ్డుపైనే ఎదురెదురుగా తిష్టవేశారు.

ఈక్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ఆ తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. చివరకు పోలీసులు లాఠీ‌ఛార్జ్‌ చేయడంతో వాళ్లపైకి రాళ్లురువ్వారు.


Also Read: పల్నాడులో వైసీపీ కేడర్ దాడులు, ఎంపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి

పరిస్థితి గమనించిన పోలీసులు భయంతో బెంబేలెత్తిపోయారు. చివరకు కేంద్ర బలగాలు రావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. స్థానిక పోలీసులు నేతలతో మాట్లాడారు. చివరకు ముఖ్యనేతలు ఇళ్లకు చేరుకున్నారు. ఘటనను పరిశీలించిన అధికారులు భారీ ఎత్తున తాడిపత్రి టౌన్‌లో భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దింపాయి.

తాడిపత్రి వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎస్పీ వాహనంపై దాడి చేయడమే కాకుండా టీడీపీ అభ్యర్థి అస్మిత్‌రెడ్డి‌పై దాడికి దిగడం దారుణమన్నారు. వైసీపీ హింసా రాజకీయాల పరాకాష్టకు ఇదే నిదర్శనమన్నారు. ఐదేళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు తమ దాడులతో ప్రజల్లో భయం కలిగించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రను ప్రజలే తిప్పికొట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.

Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

అంతకుముందు తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకుంటే నరుకుతానని బెదిరించారు. ఈలోగా టీడీపీ దీపక్‌రెడ్డి అక్కడే ఉన్నారు. ఇరువురు నేతలకు  సర్ది చెప్పి పంపించారు. ఈ విషయంలో పోలీసులు సైలెంట్‌గా ఉండడాన్ని దీపక్‌రెడ్డి తప్పుబట్టారు. ఆ తర్వాత ఇరువర్గాల కేడర్‌ను పోలీసులు చెదరగొట్టారు.

 

 

Related News

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Big Stories

×