Big Stories

Purandeswari: రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి.. పురందేశ్వరి డిమాండ్

Purandeswari: మిగ్ జామ్ తుపాను రైతాంగాన్ని కుదేలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయానికి నీటి పాలైంది. ఊహించని తుపాను.. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కోతలు కోసి ఉంచిన పంటలతో పాటు.. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు సైతం నీటమునిగాయి. వాటిని కోసి.. ఎండబెట్టేకన్నా.. ట్రాక్టర్లతో తొక్కించడమే మేలని వాపోతున్నారు. కోస్తాంధ్ర తీరంవెంబడి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరిపంటలన్నీ పడిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో పర్యటించారు.

- Advertisement -

వర్షానికి తడిన ధాన్య రాశులను పరిశీలించి.. రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఇప్పటివరకూ ఏపీ మంత్రులెవరూ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని, తడిసిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, రైతులకు సకాలంలో గోనె సంచులు అందడం లేదన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని, రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News