E-Paper
Advertisement

ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!

ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!
Advertisement

Digi Rythu Bazaar: రైతుల పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర.. వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డీజీ రైతు బజార్ అనే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా కూరగాయలను డైరెక్ట్‌గా రైతుల నుంచే వినియోగదారులకు విక్రయించనుంది. రైతులు తాము పండించిన కూరగాయలను దళారులకు అమ్మడం.. వారు మళ్లీ చిన్నచిన్న వ్యాపారులకు విక్రయించడం.. వారి దగ్గరి నుంచి జనం కొనుగోలు చేయడంతో ధరల భారం పూర్తిగా వినియోగదారుల జేబుల చిల్లులు పడేలా చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా అటు రైతులకు మంచి ధర కల్పించినట్లు అవడంతోపాటు వినియోగదారులకు సైతం తాజా కూరగాయలను తక్కువ ధరకే అందించనుంది.

ఈ యాప్‌తో తక్కువ ధరకే కూరగాయలు..

Advertisement

మార్కెట్లతో పోలిస్తే డీజీ రైతు బజార్‌ యాప్‌లో ధరలు చాలా తక్కువగా, ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. రైతు బజార్ ధరలకే ఇవి లభిస్తాయి. ఎక్కడికక్కడ తాజా కూరగాయలు, నాణ్యమైన పండ్లను నేరుగా రైతుల దగ్గర సేకరించి అందించడం వల్ల తాజాదనం అలాగే ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ వంటి మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించారు. దశలవారీగా జిల్లా, మండల స్థాయి రైతు బజార్లకు విస్తరించనున్నారు.

Also Read: పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్.. రూ. 2.25 కోట్ల భారీ సాయం ప్రకటన!

Advertisement

డౌన్‌లోడ్ చేయండి.. ఆర్డర్ పెట్టండి..

మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. మీమీ పట్టణాల్లో కూరగాయలు ఆర్డర్‌ పెట్టుకొని ఇటు ధరల భారం, టైంని సేఫ్‌ చేసుకోండి.

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×