Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ AIG ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక డాక్టర్ల బృందం.. ఆయనకు చికిత్స అందిస్తోంది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొడాలి నాని. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని బయట పెద్దగా కన్పించడం లేదు. జగన్ గంటూరు పర్యటనలో కన్పించారు. ఆ తర్వాత నుంచి మళ్లీ యాక్టీవ్‌గా లేరు.
వివరాల్లోకి వెళ్తే.. కొడాలి నాని గత రెండు, మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు కూడా.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో.. అలాగే క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. తాజాగా రెండు నెలల నుంచి తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం జగన్ వంశీని పరామర్శించడానికి.. జైలుకు వచ్చిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత మిర్చి యాడ్ రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడ కూడా యాక్టివ్‌గా కనిపించారు.
ఇక అప్పటి నుంచి కొడాలి నాని కనిపించలేదు. గత వారం, పది రోజులుగా తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి సమయంలో కొడాలి నానికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రకి తరలించారు. ఆయనను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు గానీ కుటుంబ సభ్యులు ఎవరు అధికారికంగా ప్రకటన చేయలేదు.
ఈ న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఈ సీనియర్ నేత గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో కొడాలి నాని కొన్ని అనారోగ్య సమస్యల వల్ల.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి.
Also Read: వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు.. పోలీసులకు చిక్కిన మోహనరంగా
అయితే కొడాలి నానికి గుండెపోటు అంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు గుండెపోటు రాలేదని, కేవలం గ్యాస్ట్రిక్ సమస్యలతోనే AIGలో చేరారని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో కొడాలి నానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.