AP Govt: ఏపీ ప్రభుత్వం వరుస పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన స్కీమ్ తో ఎన్నో పేద కుటుంబాలకు చేయూతనివ్వడంలో ప్రభుత్వం సఫలమవుతుందని చెప్పవచ్చు. తాజాగా మరో పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఆ పథకాలతో ఎన్నో కుటుంబాలు లబ్ది పొందాయని చెప్పవచ్చు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి, ప్రజా సంక్షేమం కోసం రోజుకొక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ల పెంపుపై నిర్ణయం తీసుకొని, పింఛన్ దారుల్లో ఆనందం నింపింది. అలాగే మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు నిర్ణయించి, పథకాన్ని కూడా విజయవంతంగా సాగిస్తోంది.
అంతేకాకుండా త్వరలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణకు సిద్దమైందని చెప్పవచ్చు. అలాగే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 20 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇలా వరుస స్కీమ్స్ అమలుచేసే చర్యల్లో గల ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతి పథకం, కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ పథకాల ద్వారా రాయితీతో కూడిన ప్యాసింజర్ ఆటోలను, రైతులకు ఉపయోగపడే పవర్ స్ప్రేయర్స్, మోటార్ ఇంజిన్లను ప్రభుత్వం అందజేయనుంది.
ఈ స్కీమ్ ద్వారా ఉపాధి కోసం ఎదురు చూపుల్లో ఉన్న వారికి లబ్ది చేకూరనుంది. అలాగే రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించడం ద్వారా ఆర్థిక చేయూత అందించినట్లుగా చెప్పవచ్చు. అందుకే అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకానికి ఎస్సీలు అర్హులుగా నిర్ణయించారు. ఎస్సీలకు 50 శాతం రాయితీతో ఒక్కొక్కటి రూ. 3 లక్షల విలువైన 4074 ప్యాసింజర్ ఆటోలను, 2685 మంది ఎస్సీ రైతులకు 50 శాతం రాయితీతో రూ.1 లక్ష 50 వేల విలువైన పవర్ స్ప్రేయర్స్, మోటార్ ఇంజిన్ వంటి వ్యవసాయ పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేయనుంది.
Also Read: AP Govt: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ కిట్స్ మాత్రం మిస్ కావద్దు!
ఈ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కొరకు దగ్గర్లోని సచివాలయాలను సంప్రదిస్తే, పూర్తి వివరాలు తెలుస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. మరెందుకు ఆలస్యం సబ్సిడీతో ఆటో కావాలంటే ఆటో, వ్యవసాయ పరికరాలు కావాలంటే వాటి కోసం దరఖాస్తు చేసేయండి మరి!