MLA defection case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఫిరాయింపు కేసుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి.. హస్తం పార్టీలోకి ఫిరాయించిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై శాసనసభలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: ECIL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.60,000, రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ప్రతివాదులకు నోటీసులు జారీ..
అయితే.. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. స్పీకర్ తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పదవీ కాలం కంప్లీట్ అయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే ఎంత వరకు కరెక్ట్ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని నిలదీసింది. అయితే దీనిపై స్పీకర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఫిరాయింపులకు పాల్పడిన కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రెటరీ, స్పీకర్, రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్ట్ రిజిస్ట్రార్ కు సుప్రీం కోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తదుపరి పిటిషన్ ఈ నెల 25కు వాయిదా..
ధర్మాసనం జారీ చేసిన ఈ నోటీసులకు మార్చి 22 లోపల సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 25 కు వాయిదా వేసింది. అయితే తమ పార్టీ బీఆర్ఎస్ తరఫును గెలిచి హస్తంలోకి ఫిరాయించిన ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఆ పది మంది ఎమ్మెల్యే సభ్యులను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో హైకోర్టు సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. అసెంబ్లీ సెక్రటరీ స్పెషల్ బెంచ్ కు అప్పీల్ చేసుకోగా.. అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. కాగా చాలా రోజులకు కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.