Laila Movie: ప్రేక్షకులు హిట్ సినిమాలను ఏ రేంజ్‌లో గుర్తుపెట్టుకుంటారో.. డిశాస్టర్ సినిమాలను కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఇచ్చిన డిశాస్టర్ల గురించి ఎన్నేళ్లయినా మాట్లాడుకుంటారు. అలా డిశాస్టర్ వల్ల ఎఫెక్ట్ అయిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఒకరు. కొన్నేళ్ల పాటు పవన్ కళ్యాణ్‌కు అసలు హిట్స్ లేవు. కానీ తన కెరీర్‌లో అతిపెద్ద డిశాస్టర్ ఏది అంటే ముందుగా తన ఫ్యాన్స్‌కు గుర్తొచ్చేది .. ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా అనగానే ‘అజ్ఞాతవాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆ డిశాస్టర్‌ను బీట్ చేస్తూ ఆ స్థానంలోకి ‘లైలా’ వచ్చేసింది.
అతిపెద్ద డిశాస్టర్
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ప్రతీ సినిమాకు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఆశపడుతుంటారు. ఆ ప్రయోగాలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. కానీ తన తాజా ప్రయోగం ‘లైలా’ మాత్రం మినిమమ్ ప్రేక్షకులను మెప్పించలేక డిశాస్టర్‌గా నిలిచింది. అంతే కాకుండా ఈ దశాబ్దంలో విడుదలయిన సినిమాల్లో అతిపెద్ద డిశాస్టర్ అయిన ‘అజ్ఞాతవాసి’ని వెనక్కి నెట్టి మరీ ‘లైలా’ ఈ లిస్ట్‌లో ముందుకొచ్చిందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. యంగ్ హీరో అయ్యిండి లేడీ గెటప్ వేసుకోవడం వల్ల ‘లైలా’పై ముందుగానే హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఆ హైప్‌ను ఈ మూవీ మినిమమ్ అందుకోలేకపోయింది.
ఎవ్వరికీ తెలియదు
ఇప్పటివరకు ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) సినిమానే ఈ దశాబ్దంలో అతిపెద్ద డిశాస్టర్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉండేవారు. ఇన్నాళ్లకు ఆ అజ్ఞాతం వీడుతూ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ‘లైలా’ అతిపెద్ద డిశాస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ‘లైలా’ను ప్రమోట్ చేయడం కోసం విశ్వక్ సేన్ మాత్రమే కష్టపడ్డాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమయిన ఆకాంక్ష శర్మ అంటే ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి తను ఈ మూవీని పెద్దగా ప్రమోట్ చేయలేకపోయింది. దర్శకుడు రామ్ నారాయణ్‌కు కూడా ఇది డెబ్యూ మూవీ అవ్వడంతో తన గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే విశ్వక్ సేన్ మాత్రమే సోలోగా చేసిన ప్రమోషన్స్.. ఈ మూవీ వర్కవుట్ అయ్యేలా చేయలేకపోయాయి.
Also Read: హరిహర వీరమల్లుపై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్..!
మొత్తం బాలేదు
విశ్వక్ సేన్ చేసిన ప్రమోషన్స్ వల్ల ‘లైలా’ (Laila) సినిమాను చూడడానికి కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. కానీ ఆ వచ్చిన ప్రేక్షకులను ఈ మూవీ సరిపడా ఇంప్రెస్ చేయలేకపోయింది. టీజర్, ట్రైలర్‌లో చూసినప్పుడు లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ పర్వాలేదు బాగున్నాడు అనే అనిపించినా సినిమా మొత్తంలో మాత్రం తన గెటప్, యాక్టింగ్ అంతా ఓవర్‌గా అనిపించాయని చాలామంది ఆడియన్స్ రివ్యూల్లో పేర్కొన్నారు. పైగా కథ కూడా పెద్దగా ఏమీ లేదని, రొటీన్‌గా సాగిపోయిందని అంటున్నారు. అలా ‘లైలా’పై ప్రేక్షకులు ఇచ్చిన పాజిటివ్ రివ్యూల కంటే నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా ఇంపాక్ట్ ఇచ్చాయి. అలా ఈ దశాబ్దంలో విడుదలయిన అతిపెద్ద డిశాస్టర్స్‌లో ‘లైలా’ ఒకటిగా చేరింది.