E-Paper
Advertisement

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?
Advertisement

Vehicle Insurance Tips: కారు లేదా బైక్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాహన ఇన్స్యూరెన్స్ చాలా ముఖ్యం. చాలామంది ప్రతి ఏడాది ప్రీమియం చెల్లించాల్సి ఉండటంతో భారంగా భావిస్తారు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు భారీ ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించే భద్రతా కవచం ఇన్స్యూరెన్స్ నిలబడుతుంది. ఇటీవల వాహనాలకు ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో ప్రమాదం జరిగితే, ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పింది. ఈ సమయంలో ఎవరైనా గాయపడినా? మరణించినా? బాధితులకు పరిహారం అందించడంలో ఇన్స్యూరెన్స్ కీలకంగా పని చేస్తుందని వెల్లడించింది. .

అందుకే రవాణా శాఖ కూడా ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ విషయంలో సీరియస్ గా ఉంటున్నారు.  కొన్ని ప్రాంతాల్లో వాహన నంబర్ ఆధారంగా ఈ వివరాలను పరిశీలించే విధానాలను కూడా అమలు చేస్తున్నారు. అందువల్ల గడువు ముగిసేలోపు ఇన్స్యూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవడం మంచిది.

ఇన్సూరెన్స్ లో రెండు రకాల పాలసీలు

Advertisement

వెహికల్ ఇన్స్యూరెన్స్‌ లో ప్రధానంగా రెండు రకాల పాలసీలు ఉంటాయి. మొదటిది థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్. ఇది చట్టప్రకారం తప్పనిసరి. మీ వాహనం వల్ల ఇతర వ్యక్తికి, వారి వాహనానికి నష్టం జరిగితే పరిహారం చెల్లించే బాధ్యతను ఇన్స్యూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. రెండోది కాంప్రహెన్సివ్, ఓన్ డ్యామేజ్ ఇన్స్యూరెన్స్. ఇది మీ వాహనానికి జరిగిన ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వల్ల కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ పాలసీని తీసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు కొంతకాలం పాటు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఏడాది పాలసీని రెన్యువల్ చేయాలి. వాహనం మోడల్, విలువ, కవరేజ్‌ను బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది.

ప్రీమియం ఖర్చు ఎలా తగ్గించుకోవాలంటే?

ప్రీమియం ఖర్చును తగ్గించుకోవడానికి కొన్ని ఈజీ మార్గాలు ఉన్నాయి. ఏడాది పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ రూపంలో మంచి తగ్గింపు లభిస్తుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ కంపెనీల ధరలను ఆన్‌ లైన్‌ లో పోల్చి చూసి తక్కువ ప్రీమియంతో మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేని యాడ్ ఆన్ కవర్లను తొలగించడం, వాలంటరీ డిడక్టబుల్ ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియం తగ్గుతుంది.

Advertisement

అంతేకాదు, వాహనాన్ని తక్కువగా ఉపయోగించే వారికి కూడా కొన్ని ప్రత్యేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. పే యాజ్ యూ డ్రైవ్ పాలసీలో ఏడాదిలో ఎంత కిలోమీటర్లు ప్రయాణిస్తారో దానికి అనుగుణంగా ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే కొన్ని కంపెనీలు పే హౌ యూ డ్రైవ్ ప్లాన్‌ ను అందిస్తున్నాయి. ఇందులో సేఫ్ గా డ్రైవ్ చేసే వారికి ప్రీమియంపై అదనపు తగ్గింపులు లభించే అవకాశం ఉంటుంది. సో, వెహికల్ ఇన్స్యూరెన్స్‌ ను ఖర్చుగా కాకుండా భద్రతగా భావించడం మంచిది. సరైన పాలసీని ఎంచుకుని, అందుబాటులో ఉన్న డిస్కౌంట్లను వాడుకుంటే తక్కువ ఖర్చుతోనే పూర్తి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

Read Also: టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

ఏథర్ కొత్త స్కూటర్‌కు ‘కోనార్క్’ పేరు ఎందుకు? అసలు విషయం చెప్పిన సీఈఓ మెహతా!

Big Stories

Advertisement
×