BigTV English

Vice Chancellor: వీసీలకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు

Vice Chancellor: వీసీలకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు

Vice Chancellors: ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత శరవేగంగా పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈ క్రమంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఉన్నతాధికారుల సెలవులు రద్దు చేయగా.. తాజాగా ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు హెడ్ క్వార్టర్లు దాటి వెళ్లొద్దని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.


అంతే కాకుండా.. షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొంది. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించుకోవాలని తెలిపింది. శాఖా పరమైన సమస్యలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉంటే ఆంధ్ర వర్సిటీలో కీలక పత్రాలు మాయం అయ్యాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం అని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..


రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలోనూ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుండటంతో.. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇక ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని అధికారవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Tags

Related News

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

MP Avinashreddy: అవినాష్‌రెడ్డికి గడ్కరీ సర్‌ ప్రైజ్.. ఆ పార్టీల మధ్య ఏం జరుగుతోంది?

Big Stories

×