BigTV English
Advertisement

Jagan Tour: సత్తెనపల్లి సవాల్: రావొద్దన్న పోలీస్, వచ్చి తీరతానన్న జగన్

Jagan Tour: సత్తెనపల్లి సవాల్: రావొద్దన్న పోలీస్, వచ్చి తీరతానన్న జగన్

ఏపీ రాజకీయాల్లో రేపు పెద్ద అలజడి జరిగే అవకాశం ఉంది. వైసీపీ అధికారం కోల్పోయాక ఈ ఏడాదిలో జగన్ చాలా ప్రాంతాలను సందర్శించారు. వైసీపీ నేతలు, కార్యకర్తల్ని పరామర్శించారు. కానీ వాటన్నిటికీ పోలీసుల అనుమతి ఉంది. కానీ ఈసారి పోలీసులు జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ జగన్ మందీ మార్బలంతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల ఆంక్షల మధ్య, ఈ పర్యటన అసలు ఎలా జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.


పర్యటన ఉద్దేశమేంటి..?
వైసీపీ అధినేత జగన్ రేపు (బుధవారం) పల్నాడు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు ఆయన వెళ్తారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ళ ఉపసర్పంచ్‌, వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

పోలీసుల అభ్యంతరమేంటి..?
ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అమరావతిపై తప్పుడు వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ క్షమాపణ చెప్పాలంటూ కొందరు మహిళలు ఆయన పర్యటనలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కొందరు వారిపై రాళ్లదాడి చేశారు. పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. తాజా పర్యటనకు కూడా పోలీసులు అనుమతిచ్చేందుకు అంగీకరించినా తగిన సమాచారం ఇవ్వడంలో వైసీపీ విఫలం అవ్వడంతో అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ కారుతో పాటు, 100 మందిని మాత్రమే అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువమందికి అనుమతి లేదని ఇప్పటికే పల్నాడు ఎస్పీ ప్రకటించారు.

నేతల పట్టుదల..
మరోవైపు వైసీపీ నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్ పర్యటన జరిగి తీరుతుందని ఉదయం నుంచీ పల్నాటు నేతలు చెబుతున్నారు. సాయంత్రానికి వైసీపీ అధికారికంగా వైసీపీ జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది.

టీడీపీ విమర్శలు..
జగన్ పర్యటనతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని, పరామర్శ పేరుతో జగన్ అల్లర్లు సృష్టించడానికి వస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు వల్ల ఆయన మరణించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ మాఫియాకు బలయ్యారని, ఆయన మరణానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. నాగమల్లేశ్వరరావు గతేడాది జూన్ లో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని, అప్పటికింకా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టలేదని అంటున్నారు. బెట్టింగ్ కి పాల్పడి, కుటుంబాన్ని అనాథలుగా మార్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి జగన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఆయన ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు.

మొత్తమ్మీద జగన్ సత్తెనపల్లి పర్యటన అలజడి రేపేలా ఉంది. పోలీసులు వద్దంటున్నా ఆయన పర్యటనకు సిద్ధమయ్యారు. జగన్ వస్తే హడావిడి చేయాలని, తమ బలం చూపించాలని నాయకులు కూడా కుతూహలంగా ఉన్నారు. పోటీపడి మరీ కార్యకర్తల్ని తరలించే అవకాశం ఉంది. మరి రేపు సత్తెనపల్లిలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×