Thammudu OTT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తమ్ముడు (Thammudu ) మూవీ టైటిల్ తో నితిన్ (Nithin) హీరోగా నటించారు. అక్కాతమ్ముడు సెంటిమెంట్ తో జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju ) సుమారుగా రూ.75 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. కేవలం రూ.10 కోట్లు కూడా రాబట్టలేక భారీ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే అటు వారం కూడా తిరగకముందే థియేటర్లలో ఫుల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన నితిన్ తమ్ముడు మూవీ..
నితిన్ హీరోగా.. సప్తమి గౌడ, వర్షా బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం తమ్ముడు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ (Laya) ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచి, ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అటు థియేటర్లలో భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇటు ఓటీటీ లోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.
తమ్ముడు మూవీ విశేషాలు..
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(Venu Sri Ram) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా రూ.75 కోట్లతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అంతేకాదు నితిన్ మార్కెట్ కి మించి ఇక్కడ బడ్జెట్ పెట్టారు. కానీ దిల్ రాజు ఆశలకు అడియాసలే మిగిలాయి అని చెప్పవచ్చు. కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేదు అంటే.. నితిన్ కి ఇండస్ట్రీలో మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందని.. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
నితిన్ కెరియర్..
హీరో నితిన్ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతం నుంచి చిత్రసీమలోకి అడుగు పెట్టిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరిగా నిలిచిన వ్యక్తి.. నిజామాబాద్ కి చెందిన ఈయన తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు కావడంతో సినిమా వాతావరణం మధ్యనే పెరుగుతూ వచ్చాడు నితిన్. చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమానిగా పేరు సొంతం చేసుకున్న నితిన్ హైదరాబాదులో ఫలక్నుమా ప్యాలెస్ లో తన స్నేహితురాలు శాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. ఇక నితిన్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలకు వ్యవహరించారు. ఏది ఏమైనా ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూడడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.
ALSO READ: Manchu Family: మంచు కుటుంబానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. 6 ఏళ్ల టెన్షన్ కి తెరపడుతూ?