Jagan Tour: వైసీపీ రూటు మార్చిందా? సోషల్‌మీడియా ప్రచారాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇకపై జనాల్లోకి వెళ్లాలని జగన్ ఫిక్స్ అయ్యారా? బల ప్రదర్శన పేరుతో కేడర్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? గురువారం జగన్ నెల్లూరు టూర్‌పై కేసులు నమోదు అయ్యాయా? అవుననే అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
వైసీపీ అధినేత జగన్‌కు కంటి నిండా నిద్ర కరువైనట్టు తెలుస్తోంది. ఓ వైపు లిక్కర్ కేసు అరెస్టులు.. మరోవైపు కేడర్‌పై నమోదు కావడంతో టెన్షన్ పడుతున్నారట. సోషల్ మీడియాను ప్రభుత్వం అడ్డుకుంటుందని భావించిన ఆయన, కుదిరితే వారానికి ఒకసారి లేకుంటే రెండు వారాలకు జనాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
తాజాగా గురువారం నెల్లూరు వెళ్లారు మాజీ సీఎం జగన్. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలను పరామర్శించారు. ఆ పర్యటన సందర్భంగా మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. జగన్ టూర్‌లో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.
ఈసారి టూర్‌లో వైసీపీ నేతలు కొత్త పద్దతి అవలంభించారు. పోలీసులు చెప్పిన నిబంధనలకు సరేనని చెప్పి పర్మీషన్లు తెచ్చుకున్నారు. చివరకు వాటిని అధిగమించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే రోడ్డులో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ALSO READ: మహిళా భక్తులకు టీటీడీ శుభవార్త.. వారిపై కేసు నమోదు చేస్తాం
అయితే వాటిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాగిపడేశారు. ఆ తర్వాత పరుగులు పెట్టేలా వ్యవహరించారు. స్పెషల్ బ్రాంచ్‌కి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ బారికేడ్ కింద పడ్డారు. ఆయన చేయి విరగడంతో ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ పర్యటన సందర్భంగా రోడ్డుపై ధర్నాకు దిగారు వైసీపీ కార్యకర్తలు. ట్రాఫిక్‌కు కలిగించినందుకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మరికొందరిపై కేసు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టడంతో మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి జగన్ నెల్లూరు టూర్‌పై మూడు కేసులు బుక్కయ్యాయి.
జగన్ ఏ జిల్లాకు వెళ్లినా నేతలు, కేడర్‌పై కేసులు బుక్ అవుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, తాజాగా నెల్లూరు జిల్లా వంతైంది. వరుసగా కేసులు నమోదు కావడంతో కేడర్‌లో భయం మొదలైంది. అభిమానం పేరుతో వెళ్లి కేసులు బుక్ కావడంతో ఆందోళన పడుతున్నారు. దీనివెనుక జగన్ ప్లాన్ ప్రత్యేకంగా ఉందని అంటున్నారు. బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు జిల్లాల టూర్లలో బల ప్రదర్శన చేస్తున్నారనే గుసగుసలు లేకపోలేదు.
జగన్ జిల్లాల టూర్లను పోలీసులు జాగ్రత్త పరిశీలిస్తున్నారు. ఆయన ఏ జిల్లాకు వెళ్లినా తొలుత పోలీసులు గాయపడుతున్నారు అంటున్నారు. చిత్తూరు, నెల్లూరు టూర్లలో అదే జరిగిందని అంటున్నారు. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టకుంటే సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందని అంటున్నారు. దీనిపై కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.