Venkataramireddy arrested: వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొందరు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కాగా, ఈ బాటలో మరికొందరు ఐఏఎస్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలోకి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి వంతైంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారు. పార్టీపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గురువారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎలాంటి అనుమతులు లేకుండా విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని భావించారు అధికారులు.
పార్టీకి వచ్చినవారి వాదన మరోలా ఉంది. పార్టీ విషయం తమకు తెలీదని, వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చామంటున్నారు తోటి ఉద్యోగులు. ఈ నేపథ్యంలో ఆయనపై అధికారులు కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. వెంకట్రామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఎక్సైజ్ నిబంధనలు ప్రకారం.. లిక్కర్ తరహా పార్టీలు చేసుకునే ముందు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సివుంది. కానీ, అనుమతులు తీసుకోకుండానే పార్టీ జరిగిందని తేల్చారు అధికారులు. ఈ పార్టీ వెనుక పెద్ద స్కెచ్ వున్నట్లు తెలుస్తోంది.
సచివాలయం క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం దాదాపు 30 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీపడుతున్నారట.
వెంకట్రామిరెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. గడిచిన ఐదేళ్లు ఆయనకు స్వర్ణయుగమని అక్కడి ఉద్యోగులు చెబుతారు. ఉద్యోగుల తరపున ఏం మాట్లాడాలన్నా నేరుగా సీఎం ఛాంబర్‌కి వెళ్లేవారట. ఈ క్రమంలో వైసీపీకి నమ్మినబంటుగా మారారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెల్సిందే.
ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్
ప్రలోభాలలో భాగంగా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు
ఎలాంటి అనుమతులు లేకుండా విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు గురువారం, రాత్రి 11 గంటలకు అందిన సమాచారం
ఐదు ఫుల్… https://t.co/5PBsHXcOCb
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024