BigTV English

Satyabhama Today Episode : సత్యకు మాట ఇచ్చిన గంగ.. భైరవితో ఆస్తి కావాలని డిమాండ్..

Satyabhama Today Episode : సత్యకు మాట ఇచ్చిన గంగ.. భైరవితో ఆస్తి కావాలని డిమాండ్..

Satyabhama Today Episode November 29 th : నిన్నటి ఎపిసోడ్ లో.. గంగ పెట్టిన కండిషన్ కి మహదేవయ్య ఒప్పుకుంటాడు. ఇక బైరవి కూడా వాళ్ళ ముగ్గురు టెస్టులు చేయించుకుంటారు అనేసి చెప్తుంది. ఇక మహిళా సంఘాలు కూడా ఆ రిపోర్ట్ రావడానికి మూడు రోజులు పడతాయి అంతవరకు మేము గంగకు సపోర్ట్ గా ఉంటామని చెప్తారు. ఇక గంగ రిపోర్టర్ రావడానికి టైం పడుతుంది కదా అంతవరకు ఇదే నా ఇల్లు అనేసి ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక మహిళ సంఘాలు కూడా ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆమె మహదేవయ్య ఇంట్లోనే ఉండాలి అనేసి డిమాండ్ చేస్తారు. దానికి మహదేవయ్యతో పాటు క్రిష్ కూడా ఒప్పుకుంటాడు. ఇంట్లోకి రాగానే బంటి ఆకలి అనగానే ఇదంతా మన ఇడ్లీ నాన్న నీకు ఏది కాబడితే అది తినేసేయ్ అనేసి గంగ అంటుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఇడ్లీలన్నీ బంటి తినేస్తాడు. సత్య గంగను తీసుకొచ్చింది తానే అనే నిజాన్ని బయట పెడుతుంది. మహాదేవయ్య షాక్ అవుతాడు. ఇక సత్య ప్లాన్ వర్కౌట్ అవుతున్న సమయంలో గంగ బ్యాగ్ సర్దుకొని వెళ్ళాలి అనుకుంటుంది.. సత్యకు ఆ విషయం చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గంగతో మాట్లాడడానికి సత్య గంగ దగ్గరికి వెళుతుంది. ఏంటి బ్యాక్ చదువుతున్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అనేసి సత్య అడగ్గానే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను అనేసి గంగా షాక్ ఇస్తుంది. ఎంత జరిగిన తర్వాత నువ్వు వెళ్ళిపోతాను అనంటే మామయ్యది గెలుపని ఆయన వెర్రి పీకుతాడు ఆయనది తప్పేం లేదని సంబరపడిపోతాడు ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు అనేసి గంగను బతిమలాడుతుంది సత్య. మా మామయ్యకి ఈ విషయం తెలియాలని నేనే చెప్పాను నీకు ఏం కాదు ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకునింది ఇప్పుడు ఆయనకే ప్రాబ్లం రాజకీయంగా ఆయన ఎదగాలంటే నువ్వు చెప్పినట్టు చచ్చినట్టు చేయాల్సిందే అనేసి చెప్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాలని ఆలోచన తీసే గంగ నువ్వు నా జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చావు అది ఆలోచించు అనేసి రిక్వెస్ట్ చేస్తుంది. నా భర్తను నేను జీవితాంతం ఇలా కాపాడుకుంటూ ఉండాలి. ఈ విషయం అటో ఇటో తేలిపోతే క్రిష్ ఎవరు కొడుకుని తేలిపోతే ఆ తర్వాత నాకు మనశాంతిగా ఉంటుందని ప్రాధేయపడుతుంది.

సత్య మనసు అర్థం చేసుకున్న గంగ నువ్వేం బాధపడకు ఇక మీద నుంచి మీ మామయ్యకు గుక్క తిప్పుకోవాలి అన్న నా పర్మిషన్ ఉండాలి అలా చేస్తాననేసి అంటుంది. కానీ డిఎన్ఏ టెస్ట్ అది ఇది అంటున్నారు కదా దానికి నేనైతే ఒప్పుకోను అనేసి అనగానే నువ్వు ఒప్పుకోవడం కాదు ఆయన ఒప్పుకోవడం అయిన ఒప్పుకుంటే అసలు క్రిష్ తండ్రి అతని కాదని బయటపడిపోతుంది రేపు ఏం జరుగుతుందో చూడాలి అనేసి అంటుంది. ఇక ఉదయం గార్డెన్ లో క్రిష్ ఎక్ససైజులు చేస్తుంటాడు. భైరవి క్రిష్ దగ్గరికి వెళ్లి అరె చిన్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ గంగని బయటికి పంపించాలి అనేసి అడుగుతుంది. బాపు ఒక్క మాట చెప్పని ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావని క్రిష్ భైరవి తో అంటాడు.


నా కొడుకు నుంచి నన్ను వేరు చేయడం అంత సులువు కాదు అనేసి గంగ ఎంటర్ ఇస్తుంది. కొడుకు ఇంతగానే కష్టపడి పోతున్నాడు అని నేను వేడి వేడి పాలు తీసుకొచ్చాను ఇంకొంచెం తాగమ్మా అనేసి క్రిష్ బ్రతిమలాడుతుంది గంగ.. మీ పెద్దమ్మ ఏమి అనుకోదులే నువ్వు తాగమ్మా అనేసి క్రిష్ అనగానే భైరవి కోపంతో రగిలిపోతుంది. ఇక అప్పుడే సత్య మీకోసం మల్లెపూలు తీసుకొని వచ్చాను అనేసి బైరవికిస్తుంది. పూలను గంగ లాక్కొని పెట్టుకుంటుంది. సగం నాకు సగం ఇక మీద నుంచి మనం సగం సగం పంచుకోవడం అలవాటు చేసుకోవాలి అక్క అనేసి అంటుంది. సత్యని అడిగితే నాకేం తెలీదు మీరు మీరు చూసుకోండి అనేసి సత్య సైలెంట్ అవుతుంది. ఇక భైరవి లోపలికి వెళ్ళగానే బంటి ఇడ్లీలను తింటూ ఉంటాడు. పంకజం నోరు తెరిచి అలానే చూస్తూ ఉంటుంది. ఆకలేస్తుంది ఇడ్లీ పెట్టవే అనేసి అడుగుతుంది. పదిమందికి చేసిన ఇడ్లీలు ఈయన పొట్టలో ఉన్నాయమ్మా అనేసి పంకజం అనగానే బంటిపై భైరవి సెటైర్ లేస్తుంది. బస్తాడు బిర్యానీ తిన్నావు రాత్రి ఇప్పుడు నీకు ఇంత ఆకలేసిందా అనేసి అడగని బంటి కొంచెం ఆకలేసింది అందుకే ఇడ్లీలు తిన్నాను అనేసి అంటాడు. ఇంకేదైనా తీసుకురావే చేసుకుని అని భైరవి అంటే, పంకజం ఇడ్లీలు చేసి చేసిన గూడలు పడిపోయాయి అమ్మ మీరు మీ కోడల్ని అడిగి చేపించుకోండి అనేసి అంటుంది. ఇక బంటి భోజనం చేస్తే మళ్ళీ పిలవండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు సత్య ఇటు వెనుక అత్తకి హితబోధ చేస్తారు. మావయ్యతో మీరు పర్సనల్ గా చెప్పాల్సిన విధానంలో చెప్తే వింటాడు అనేసి చెప్తారు.. ఇక గార్డెన్లో మహదేవయ్య సిగార కాలుస్తూ ఉంటాడు. సిగరకు నిప్పు పెట్టకుండానే చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తునట్టు ఉంటాడు. ఇప్పుడే కృష్ణ అక్కడికి వచ్చి ఏమైంది బాపు నాకు చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉందా అనేసి అడుగుతాడు.. ఇక భైరవి అప్పుడే మహదేవయ్య దగ్గరకు వచ్చి మాట్లాడాలని అడుగుతుంది. ఆ గంగకు ఎంతో కొంత పడేసి దాన్ని పంపించేయండి అనేసి అనగానే సత్య జయమ్మ ఇద్దరు భైరవికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. వీరందరి మాటలు విన్న గంగ అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. కావాలో చెప్పు అని భైరవిడగని సగం ఆస్తి కావాలి అనేసి అందరికీ షాక్ ఇస్తుంది గంగ. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో డిఎన్ఎ టెస్ట్ కోసం డాక్టర్లు వస్తారు. మరి ఏం జరుగుతుందో రేపు చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×