E-Paper
Advertisement

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!
Advertisement

Upasana Konidela: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా అందరికీ ఎంతో సుపరిచితమైన ఉపాసన తన వృత్తిపరమైన కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాసన తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక అద్భుతమైన వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

సుందరకాండం పారాయణం పూర్తి చేసిన ఉపాసన..

ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున భక్తీశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈమె సుందరాకాండం పారాయణం(Sundara Kandam Parayanam)పూర్తి చేసినట్లు తెలుపుతూ ఒక వీడియోని షేర్ చేశారు. తాను సెప్టెంబర్ ఒకటవ తేదీ సుందరకాండం పారాయణ చేయాలని నిర్ణయం తీసుకున్నారట 21 రోజులలోపే దీనిని పూర్తి చేయాలని భావించిన ఉపాసన అనుకున్న విధంగానే సుందర కాండం పారాయణ చదవడం పూర్తి చేశానని తెలియజేశారు. అదే విధంగా తన తాతయ్య డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి(C.Prathap Reddy)కి ఒక అద్భుతమైన కానుకను అందించినట్లు తెలిపారు.

శ్రీరాముడి పై భక్తి స్ఫూర్తిదాయకం…

Advertisement

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ స్వయంగా రూపొందించిన ఒక రాముని విగ్రహాన్ని ఈమె తన తాతయ్యకు అందించారు అయితే ఈ విగ్రహం అయోధ్యలో కొలువైన శ్రీ రాముడిని పోలి ఉండటం విశేషం. ఏడాది క్రితమే తన తాతయ్యకు ఈ కానుకను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఉపాసన ఈ సందర్భంగా తెలియజేశారు.ఆయనకు సుందరకాండపై ఉన్న భక్తి, శ్రీరాముడిపై ఉన్న విశ్వాసం తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని ఉపాసన తెలిపారు. శ్రీరాముడి అనుగ్రహంతో జీవితంలో వచ్చే అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని ఉపాసన ఈ సందర్భంగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

?stkn=MWUwNXBjdmc2aXhoZA%3D%3D

Advertisement

ఇలా ఉపాసన తన వృత్తి పరమైన కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సాయిబాబా వ్రతం, ఇతర వ్రతాలను, పూజా కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. తాజాగా ఈమె సుందరకాండం పారాయణం పూర్తి చేయడంతో ఈమెకు ఉన్న దైవభక్తి పట్ల అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన మోస్ట్ ఇన్స్పైరింగ్ లేడీ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఉపాసన రామ్ చరణ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ఇక ఉపాసన ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఒక వైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు మెగా ఇంటి కోడలిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యాపారాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు.ఇక రాంచరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల పెద్ద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న చరణ్ త్వరలోనే సుకుమార్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుందని సమాచారం.

Also Read: కొడుకు పేరును రివీల్ చేసిన నారా రోహిత్.. పేరుకు అర్థం ఇదేనా?

Related News

పుష్ప మంగళం శీను క్యారెక్టర్ మిస్ చేసుకున్న నటుడు.. రాసి పెట్టలేదంటూ!

రూ.43 కోట్ల చెక్కుల వివాదం.. రాధాపై అంబికా షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృవియోగం!

బ్లడ్ అమ్ముకుని సంపాదించాల్సిన ఖర్మ నాకేంటి? చిరు షాకింగ్ కామెంట్స్!

కొడుకు పేరును రివీల్ చేసిన నారా రోహిత్.. పేరుకు అర్థం ఇదేనా?

మైనర్ బాలికపై దారుణం.. దిశా పటానీ సిస్టర్ ఫైర్!

రణబాలి ‘ఏందయ్యా సామి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Big Stories

Advertisement
×