Big Stories

Viveka Murder Case : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా.. ఎందుకంటే..?

Viveka Murder Case(AP Latest News): వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.బుధవారం జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టాలని అవినాష్‌రెడ్డి తరపు లాయర్‌ కోరారు. అందుకు కోర్టు అంగీకారం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.

- Advertisement -

అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారణ చేపట్టాలి. కానీ సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఆ సమయానికి అందకపోవడంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అలాగే వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి. తీర్పును తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

- Advertisement -

మరోవైపు పులివెందుల క్యాంపు కార్యాలయంలో మంగళవారం అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సునీత స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. తొలుత సునీత ఇచ్చిన స్టేట్మెంట్ లో తన ప్రస్తావనే లేదన్నారు. సీబీఐ దర్యాప్తు కుట్ర కోణంలో ఉందన్నారు. తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

సునీత పూర్తిగా మాట మార్చారని అవినాష్ రెడ్డి అన్నారు. సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే వివేకా హత్య జరిగిన ఇంటికి వెళ్లానని తెలిపారు. ఫోన్ రావడం 15 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు.తనకు తండ్రి భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేయబోయే ముందు దస్తగిరి రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఆనాడే వాళ్లు చంపి డ్రైవర్ ప్రసాద్ ను ఇరికించాలని చూశారన్నారు.ఇప్పుడు అలాంటి కుట్రే తన మీద జరుగుతోందని ఆరోపించారు. తప్పు చేయలేదుకాబట్టే మూడేళ్లుగా సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదన్నారు. మీడియా ఈ కేసులోని వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను మరో రెండురోజులు పులివెందులలో ఉంటానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తన అరెస్ట్ అంశంపైనా స్పందించారు. అంతా దైవాదీనం అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News