Bhumana Vs Srilakshmi: వైసీపీ రూటు మార్చిందా? ఐఏఎస్ శ్రీలక్ష్మిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోందా? ఆమెని కాపాడకుంటే తాము ముగినిపోతామని వైసీపీ భావిస్తోందా? ఈ క్రమంలో ఆమెపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టిందా? వైసీపీ నేత భూమన మాటల వెనుక అసలేం జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి చెప్పనక్కర్లేదు. వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె జైలుకి వెళ్లారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎంట్రీ ఇవ్వడం, కీలకమైన శాఖల బాధ్యతలు చేపట్టారు. ఆమె హయాంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని టీడీపీ పదేపదే ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై కూటమి వర్సెస్ వైసీపీ మాదిరిగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో చాలామంది వైసీపీ నేతలపై కత్తి వేలాడుతోంది. దీన్ని నుంచి బయటపడాలంటే మొదట శ్రీలక్ష్మిని టార్గెట్ చేస్తే తాము బయట పడవచ్చని భావించింది. ఆమెని సేఫ్‌లో పెట్టేందుకు రివర్స్ డ్రామా మొదలుపెట్టింది. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఆమెని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీలక్ష్మికి డబ్బులు సంపాదించడమే తప్పా ఎలాంటి నైతిక విలువలు లేవని తేల్చేశారు భూమన. ఆమె తాటకి మాదిరిగా కింది స్థాయి అధికారుల పట్ల వ్యవహరించారని వ్యాఖ్యానించారు. టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు కొట్టేయాలని ఆమె ప్లాన్ చేశారని, తాము అడ్డుకున్నామంటూ కొత్త వెర్షన్‌ని తెరపైకి తెచ్చారు సదరు నేత.
ALSO READ: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా?
గతంలో ఆమె మంత్రులను పూచిక పుల్లలా చూసిందన్నారు. మంత్రులను సైతం లెక్క చేయలేదని ఆమె తీరును తప్పుపట్టారు. మూడున్నర దశాబ్దాలుగా ఎక్కడ పనిచేసినా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఆమె గురించి అత్యున్నత న్యాయస్థానం వెటకారంగా మాట్లాడిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆమె రోజూ ధరించే చీర లక్షన్నర రూపాయలని వ్యాఖ్యానించారు. అంతేకాదు 50 లక్షల రూపాయలకంటే విలువైన విగ్గులు ఆమె సొంతమన్నారు. అలాంటివి 11 వరకు ఆమె వద్ద ఉన్నాయిని చెప్పకనే చెప్పారు. రోజుకో విగ్గుతో ఆమె దర్శనమిస్తుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చూశారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాడు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి. మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆమె ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా? TDR బాండ్స్‌లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు భూమనకు సంధించారు.
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని, ఓడిపోయిన తర్వాత భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన భూమన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పకనే చెప్పారు భాను ప్రకాష్‌రెడ్డి.
మొత్తానికి భూమన వ్యాఖ్యలను గమనించినవారు వెనుక జగన్ ఉన్నారని బలంగా నమ్ముతున్నారు టీడీపీ నేతలు. హైకమాండ్ నుంచి ఆదేశాలు రాకుండా భూమన మాట్లాడే ఛాన్స్ లేదని అంటున్నారు. ఈ లెక్కన టీడీఆర్ బాండ్ల విషయంలో వైసీపీ నేతలు మునిగిపోవడం ఖాయమని ఆఫ్ ద రికార్డులో కూటమి నేతల మాట.
IAS శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత?
TDR బండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉంది
టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారు
ఆమె ఒక అవినీతి అనకొండ
అవినీతితో వేల కోట్లు లూటీ చేసింది… pic.twitter.com/jsqZBxLtQv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి
మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?
ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా?
TDR బాండ్స్ లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా?
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు… pic.twitter.com/4yqUWW3viC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025