Big Stories

Sattenapalli Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. సత్తెనపల్లిలో సత్తా చాటే అభ్యర్థి ఎవరు ?

Andhra politics news

Sattenapalli Assembly Constituency(Andhra politics news):

సత్తెనపల్లి.. సత్తా ఉన్నవారిదే ఇక్కడ గెలుపు. పల్నాడు జిల్లాలో హాట్‌ సీటుగా పేరున్న ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టుల వరకు అన్ని పార్టీల వారు గెలుపు సాధించారు. అందుకే పార్టీల పరంగా కాకుండా.. సత్తా ఉన్న అభ్యర్థినే ఇక్కడి ప్రజలు ఆదరిస్తారు.. అధికార పీఠం ఎక్కిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ గెలుపు జెండా ఎగరేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన అంబటి రాంబాబు ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి అంబటి రాంబాబు లేదా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ అభ్యర్థి బరిలోకి దిగితే ఫలితం ఎలా ఉండనుంది? ఎవరి భవితవ్యాన్ని ప్రజలు ఎలా ఖరారు చేయనున్నారు? అనే అంశాలపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఎలక్షన్‌ సర్వే నిర్వహించనుంది. ఈ రిపోర్ట్‌ను పరిశీలించే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.

- Advertisement -

2019 RESULTS

- Advertisement -

2019లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు 52 శాతం ఓట్లతో గెలుపొందారు. ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై ఆయన 10 శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కోడెలకు 42 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అంబటి గెలుపుకు వైసీపీ వేవ్‌ బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో టీడీపీ ఓట్లు బాగానే చీలాయి. దీనికి తోడు కోడెల కుమారుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయి. జనసేన తరపున పోటీ చేసిన యర్రం వెంకటేశ్వర రెడ్డికి 5 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి రాజకీయ పరిస్థితులు మారాయి. టీడీపీ అభ్యర్థి మారాడు. నియోజకవర్గంలో బలంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో వైపు వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టికెట్ రెస్‌లో ఉన్నారు. ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా వల్ల అవుతుందా? టీడీపీలోని గ్రూపులు కన్నా లక్ష్మీనారాయణకు సహకరిస్తాయా? సత్తెనపల్లిలో ఈసారి కనిపించబోయే సీనేంటి? అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలు చూద్దాం.

ముందుగా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..

అంబటి రాంబాబు (YCP) ప్లస్ పాయింట్స్

సమర్థవంతంగా సంక్షేమ పథకాల అమలు

అంబటి రాంబాబు మైనస్ పాయింట్స్

ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత

అమలు కాని ఎన్నికల హామీలు

క్యాడర్‌లో పెరుగుతున్న వ్యతిరేకత

తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావనలో ముఖ్యనేతలు

మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో కనిపించకపోవడం

ట్యాక్స్‌లు పెంచడంపై ప్రజల్లో వ్యతిరేకత

రోడ్లు, డ్రైనేజీలను బాగు చేయకపోవడం

వ్యతిరేక ఫలితాలిస్తున్న అంగన్వాడీల సమ్మె, చెత్తపై పన్ను

ఇవి అంబటి రాంబాబు వివరాలు.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

మోదుగుల వేణుగోపాల రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

2019 ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి

మోదుగుల వేణుగోపాల రెడ్డి మైనస్ పాయింట్స్

గ్రౌండ్‌ లెవల్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడం

ఎంపీగా ఉన్న సమయంలో అభివృద్ధి చేయకపోవడం

పార్టీలు మారడంపై వ్యతిరేకత

ఇక టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

కన్నా లక్ష్మీనారాయణ (TDP) ప్లస్ పాయింట్స్

రాజకీయాల్లో తల పండిన నేతగా పేరు

కాపు సామాజిక వర్గ నేత కావడం

క్యాడర్‌ పూర్తిగా సహకరించడం

ప్రజలకు వీలైనంత ఆర్థిక సాయం చేయడం

కలిసి రానున్న జనసేనతో పొత్తు

Caste Politics

సత్తెనపల్లిలో సామాజిక వర్గపరంగా చూస్తే 21 ఎస్సీలు ఉన్నారు. వీరిలో వైసీపీకి 60 శాతం మంది మద్ధతిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఈ సామాజిక వర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 35 శాతం మంది టీడీపీ కూటమికి, ఇతరులకు 5 శాతం మంది మద్ధతిస్తున్నారు..

17 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గ ప్రజలు 70 శాతం మంది టీడీపీకే తమ మద్ధతు తెలుపుతున్నారు. ఈ సామాజిక వర్గంలో వైసీపీకి కేవలం 25 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేస్తామన్నారు. వీరంతా టీడీపీ సాంప్రదాయ ఓటర్లని సర్వేలో తేలింది. సత్తెనపల్లిలో టీడీపీ ఆవిర్భావం నుంచి వీరంతా టీడీపీని ఆదరిస్తూ వస్తున్నారు.

ఇక కాపు సామాజిక వర్గ ప్రజలు 14 శాతం ఉన్నారు. వీరి నుంచి కూడా వైసీపీకి 30 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. 65 శాతం మంది టీడీపీ కూటమికే జైకొడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఈ సామాజిక వర్గ నేత కావడం టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. అంబటి రాంబాబు ఈ సామాజిక వర్గ నేతే అయినా ప్రస్తుత పాలన తీరుపై చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నట్టు సర్వేలో తేలింది. అయితే కాపు నేస్తం లబ్ధిదారులు మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం వారు 12 శాతం ఉన్నారు. వీరిలో వైసీపీకి 40 శాతం మద్ధతిస్తుంటే.. టీడీపీ కూటమికి 55 శాతం మద్దతు పలుకుతున్నారు. ఇతరులకు 5 శాతం మద్దతిస్తున్నారు. ఈ సామాజిక వర్గంలో కూడా చాలా మంది టీడీపీ సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు.

తొమ్మిది శాతం ఉన్న ముస్లింలలో వైసీపీకి, టీడీపీకి సమానంగా 45 శాతం మద్ధతిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది మాత్రం ఇతర పార్టీలకు మద్ధతు పలుకుతున్నారు. 8 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో కూడా వైసీపీకి, టీడీపీ కూటమికి సమానంగా 40 శాతం మద్ధతు పలుకుతున్నారు. అయితే అంబటిపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీకి మద్ధతిస్తున్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

ఇక వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తే..

అంబటి రాంబాబు VS కన్నా లక్ష్మీనారాయణ

ఇప్పటికిప్పుడు సత్తెనపల్లిలో ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు గెలిచే అవకాశాలు 51 శాతం ఉన్నాయి. అదే సమయంలో అంబటి రాంబాబు గెలుపు అవకాశాలు 39 శాతం మాత్రమే ఉన్నాయి. కన్నా రాజకీయ చరిష్మా ఆయనకు అనుకూలంగా ఉండగా.. పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా అంబటికి ఎదురుగాలి తప్పదని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం.. ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. అదే సమయంలో అన్ని సామాజిక వర్గాల్లో టీడీపీకి అనుకూలత ఉండటం.. జనసేనతో ఉన్న పొత్తు కారణంగా టీడీపీకి బాగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

మరో సీనేరియాలో అంబటికి బదులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తే..

మోదుగుల వేణుగోపాల రెడ్డి VS కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లిలో మోదుగుల, కన్నా తలపడినా టీడీపీ గెలిచే అవకాశాలు 49 శాతం ఉన్నట్టు బిగ్ టీవీ సర్వే చెబుతోంది. మోదుగులకు కేవలం 44 శాతమే గెలిచే అవకాశం ఉండగా.. ఇతరులకు 7 శాతం మాత్రమే ఉంది. అయితే అంబటికి బదులు మోదుగుల పోటీ చేస్తే వైసీపీకి గెలిచే అవకాశాలు కాస్త పెరిగినా.. కన్నాను ఢీకొట్టే అవకాశాలు లేవని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News