BigTV English

BCCI: టీమిండియా ప్లేయర్లకు డైమండ్‌ రింగ్స్… ?

BCCI: టీమిండియా ప్లేయర్లకు డైమండ్‌ రింగ్స్… ?

BCCI:  టీమిండియా ప్లేయర్లకు ( Team India ) అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2024 t20 ప్రపంచ కప్ గెలిచినందుకుగాను… టీమిండియా ప్లేయర్ లందరికీ అదిరిపోయే రింగులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. నాలుగు రోజుల కిందట ముంబైలో… దీనికి సంబంధించిన ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ ప్రారంభం కంటే ముందే…ప్రమాదంలో RCB, SRH ?

అప్పుడు టీమిండియా ప్లేయర్లు అందరికీ రింగులు స్పెషల్ గిఫ్ట్ ల కింద ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India )… వాటిని రివీల్ చేయలేదు. అయితే ఇవాళ మాత్రం టీమిండియా ప్లేయర్లకు ఇచ్చిన రింగుల వీడియోను… పంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అదిరిపోయే తరహాలో డిజైన్ చేసిన రింగు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. టి20 ప్రపంచ కప్ గెలిచినందుకుగాను… స్పెషల్ రింగ్ ( Champions Ring ) ఇండియా కెప్టెన్ కు ఇచ్చారు.


 

అలాగే రోహిత్ శర్మకు ఇచ్చిన… రింగు పైన 45 అని అతని జెర్సీ నెంబర్ ఉంది. దీనికి సంబంధించిన విజువల్స్… బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో… మనం చూడవచ్చు. మొన్న జరిగిన ఈవెంట్లో… టి20 ప్రపంచ కప్ ఆడిన ప్లేయర్ లందరూ హాజరై… తమ రింగులను అందుకున్నారు. బ్లాక్ సూట్ లో టీమిండియా ప్లేయర్ లందరూ… ఈ ఈవెంట్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చిన రింగులను టీమిండియా ప్లేయర్ లందరూ తమ… చూపుడు వేలకు ధరించారు. సూర్య కుమార్ యాదవ్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్లు… రింగులను ధరించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ రింగు తీసుకునే వీడియోను హైలైట్ చేశారు. దీంతో టీం ఇండియా ప్లేయర్లకు… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Team India: కోహ్లీ కారణంగా అయ్యర్, జైస్వాల్‌ కెరీర్‌ నాశనం ?

ఇది ఇలా ఉండగా…. జూన్ 29వ తేదీ 2024 సంవత్సరంలో జరిగిన టి20 ప్రపంచ కప్ లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే t20 ప్రపంచ కప్ గెలుచుకుంది టీమిండియా. 2007 మహేంద్రసింగ్ ధోని… మొదటి టి20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా… ఆ తర్వాత… రోహిత్ శర్మ కెప్టెన్సీలో విజయం సాధించింది. 2024లో ఈ విజయాన్ని దక్కించుకుంది టీం ఇండియా. దీంతో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ అనంతరం… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు తీసుకున్న నిర్ణయం ఒక రోజు తర్వాత… రవీంద్ర జడేగా కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×