E-Paper
Advertisement

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Bonda Uma: విజయవాడ బందరు రోడ్డులో సాప్ (SAAP) కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడి వైకాపా దిగజారుడు రాజకీయాకు స్పష్టమైన నిదర్శనమని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఉపాధ్యాయులపై రౌడీషీటర్ల దాడి

Advertisement

విద్యార్థుల ముసుగులో వైకాపాకు చెందిన రౌడీషీటర్లు, గూండాలు కర్రలు, గుడ్లతో ఉపాధ్యాయులపై దాడికి తెగబడ్డారని ఉమ ఆరోపించారు. సందీప్, చైతన్య, అవుతు శైలజారెడ్డి, శ్రీనివాసరెడ్డి వంటి వారు పక్క ఊర్ల నుంచి రౌడీలను రప్పించి బందరు రోడ్డులో బైటాయించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.

అమరావతి ఇమేజ్‌కు భంగం

Advertisement

గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు కోర్టుల ద్వారా బయటపడుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశవిదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే.. వైకాపా మాత్రం గంజాయి బ్యాచ్‌లతో అల్లర్లు సృష్టిస్తూ అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం

ఈ ఘటనపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. నిఘా వర్గాలు, టాస్క్ ఫోర్స్ పూర్తిగా విఫలమయ్యాయని, అనుమతి లేకపోయినా అంతమంది రౌడీలు విజయవాడకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదుటే ఈ గొడవ జరిగినందున, వీడియోల ఆధారంగా బాధ్యులపై కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడను రావణకాష్టంగా మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైకాపాను పూర్తిగా రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణలో ఉద్యోగుల పోరుబాట.. సీఎస్ చర్చలు ఫెయిల్.. ఇక తేల్చుకోవడమే!

Tags

Related News

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు

బలంగా ఢీ కొన్న లారీ-టిప్పర్, విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి..

విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా

డీసీసీబీ స్కామ్‌పై పవన్ కళ్యాణ్‌కు లేఖ.. సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి అనిత హెచ్చరికలు జారీ!

Big Stories

Advertisement
×