BigTV English

Road Accident: జమ్మలమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందికి గాయాలు

Road Accident: జమ్మలమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందికి గాయాలు

Road Accident: కడప జిల్లా జమ్మలమడుగులో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలెరోను ఢీకొట్టడంతో 13 మంది గాయపడ్డారు. ముద్దనూరు నుండి పెద్ద పసుపుల గ్రామానికి వ్యవసాయ కూలీలతో వెళుతున్న సమయంలో ఘటన జరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో పాటు రాష్ డ్రైవింగ్ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. జమ్మలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా జమ్ములమడుగులోని శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టచేతపట్టుకుని బతుకు దెరువు కోసం వెళుతున్న కూలీలపైనే విధి వెక్కిరించింది. జమ్ములమడుగుకు చెందిన ఆటో ప్రతిరోజు ముద్దనూరు నుండి పెద్ద పసుపుల గ్రామానికి కూలీల పనులకు వెళుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 20 మంది కూలీలతో బయల్దేరారు. ఇంతలో బోలేరును ఆటో ఢీకొట్టింది.

Also Read: అడవి పంది అనుకుని మనిషిపై కాల్పులు – శవాన్ని ఎలా మాయం చేశారో తెలుసా


దీంతో 13 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో పాటు, రాష్ డ్రైవింగ్ ఘటనకు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జిమ్‌ ట్రైనర్‌ అంటే జిమ్‌కు వచ్చేవారికి వర్క్‌అవుట్స్ నేర్పించాలి…ఇంకా అంటే బాడీ బిల్డింగ్‌కి డైట్‌ చెప్పాలి. కానీ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఐలాం కాలనీలో జిమ్‌ నిర్వహిస్తున్న కుమొరల్ల ప్రసాద్‌ అనే వ్యక్తి అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు.జిమ్‌కు వచ్చే పలువురు యువతులను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు. కొన్ని రోజులుగా ఆమె మీద అనుమానం పెంచున్నాడు.

మాట్లాడుకుందామని ఆమెను పార్క్‌కి పిలిచి.. పొత్తి కడుపుపై తన్ని దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని తన సోదరికి చెప్పింది బాధితురాలు.దీంతో సర్ది చెప్పడానికి వచ్చిన ఆమెని దూషించాడు జిమ్‌ ట్రైనర్ ప్రసాద్. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.పైగా జిమ్‌ ట్రైనర్‌ ప్రసాద్‌ మద్యం కూడా సేవించి ఉన్నట్టు గుర్తించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×