BigTV English

AP News: ఇదేక్కడి అన్యాయం.. కూతురికి వైద్యం సరిగ్గా చేయలేదని ప్రశ్నించినందుకు తండ్రిపై దాడి

AP News: ఇదేక్కడి అన్యాయం.. కూతురికి వైద్యం సరిగ్గా చేయలేదని ప్రశ్నించినందుకు తండ్రిపై దాడి

AP News: కూతిరికి వైద్యం సరిగా చేయలేదని ప్రశ్నించినందుకు తండ్రిపై హాస్పిటల్ సిబ్బంది దాడి చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా, ఆశ్వరావుపేట వద్ద ఉన్న త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగింది. రాజేష్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కూతురు అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రధాన వైద్యుడు కాకుండా.. మరో వైద్యురాలి చేత ట్రీట్‌మెంట్ జరిగింది.


సరైన చికిత్స అందడం లేదని ప్రధాన డాక్టర్‌కు చెప్పిన రాజేష్
బాలిక ఆరోగ్యం మెరగు పడకపోవడంతో.. రాజేష్ డాక్టర్‌ను కలిసి చికిత్స సరిగ్గా అందడం లేదని చెప్పాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది బాధితుడితోపాటు అతని బావమరిదిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకన్న బాధితుడి బంధవులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అలాగే పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీ కెమెరాలు చూసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

రాజేష్‌ అతని బావమరిదిపై హాస్పిటల్ సిబ్బంది దాడి..
కూతురికి వైద్యం సరిగా చేయలేదని ప్రశ్నించిన తండ్రి, అతని బావమరిదిపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. టి. నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన వై. రాజేశ్ తన ఆరేళ్ల కుమార్తెకు జ్వరం, ఇతర అనారోగ్య కారణాలతో జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రోడ్డులోని త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం చేర్చారు. అయితే ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కాకుండా మరో వైద్యురాలు చికిత్స అందిస్తుంది. బాలికకు ఆరోగ్యం నయం కాకపోవడంతో సోమవారం సాయంత్రం బాలిక తండ్రి వైద్యుడ్ని కలిసి చికిత్స సరిగా అందలేదని చెప్పి బయటకు వస్తూ ఉండగా బాలికకు రాజేశ్, ఆయన బావమరిది తాతారావుపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసినట్లు తెలిపారు.


Also Read: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. బాధ్యులెవరో, తప్పులెవరివో.. పీసీ ఘోష్ రిపోర్ట్‌లో ఏముందంటే!

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
విషయం తెలుసుకున్న బాలిక బంధువులు ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సీసీ టీవీ వీడియోలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని పోలీసులని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దీనిపై న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా ఇదే ఆసుపత్రి వైద్యులు , సిబ్బంది పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి.

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×