BigTV English

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : ఏపీలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, మరో ముగ్గురి నిందితులపై విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హోంగార్డులు శ్యామ్‌సుందర్ , శ్రీనుపైనా కేసులు నమోదయ్యాయి. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా సూరిబాబు అనే వ్యక్తి వ్యవహరించారు. అతడిపై విశాఖ ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద కేసులు ‌ నమోదు చేశారు.


సీతమ్మదార ప్రాంతంలో స్వర్ణలత రాత్రి విధుల్లో ఉండగా సూరిబాబు రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించారు. అందులోంచి రూ.12 లక్షలు తీసుకున్నారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు చేపట్టారు. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×