Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌కు పీఏగా జ్యోత్స్న ఎందుకు ఎంపిక చేశారని మాలిని, దక్షిణమూర్తిని అడిగితే.. మరి నువ్వు జ్యోత్స్నను జాబ్‌లోంచి ఎందుకు తీసేయించావు అని అడుగుతాడు దక్షిణమూర్తి. ఆ మాటలకు మాలిని షాక్ అవుతుంది.జ్యోత్స్న అక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదని మాలిని చెప్తుంది. అది మంచే కానీ పీఏ పోస్టుకు ఎందుకు రిజెక్ట్ చేశారు అంటూ అడగ్గానే.. మాలిని షాక్ అవుతుంది. జ్యోత్స్న నన్ను కలిసింది. నాతో మాట్లాడింది అంటూ దక్షిణమూర్తి చెప్పగానే.. మాలిని షాక్ అవుతుంది. తనను కలిసిన జ్యోత్స్న అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు.. ఎందుకు జ్యోత్స్నను రిజెక్ట్ చేశారు అని అడగ్గానే..
అందుకు కారణం ఆ శివనారాయణ బాబాయ్ అంటూ మాలిని చెప్పగానే.. మధ్యలో వాడెందుకు వచ్చాడు అంటూ దక్షిణమూర్తి అడిగితే.. జ్యోత్స్నకు జాబ్ ఇస్తే ఆయన ఇక్కడకు వచ్చి మిమ్మల్ని మళ్లీ అవమానిస్తారు అని ఇవ్వలేదు అంటూ మాలిని చెప్తుంది. రాని వచ్చి ఏం చేస్తాడో చూస్తాను. జ్యోత్స్న ఇక్కడే ఉంటే మనల్ని బాగా అర్థం చేసుకుంటుంది. అప్పుడు జ్యోత్స్న ద్వారా నా కూతురు నా దగ్గరకు వస్తుంది. నాకు నా కొడుకు ఎంతో నా కూతురు కూడా అంతే.. నాకు నా మనవడు ఏంతో నా మనవరాలు కూడా అంతే.. అది అడిగితే పీఏ పోస్ట్ కాదు ఏదైనా ఇస్తాను. కానీ అది ఏదీ అడగలేదు నేనే ఇచ్చాను. వెళ్లి నీ కొడుకును సంతకం పెట్టమను అంటూ వెళ్లిపోతాడు దక్షిణమూర్తి. మాలిని కోపంతో రగిలిపోతుంటుంది.
మా తాత నీకు ఎందుకు సపోర్టు చేశాడు. నీకు ఎందుకు సంతకం చేశాడు అంటూ సూరజ్ అడిగితే.. అది మీ తాతనే అడుగు అంటుంది. నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అంటే చెప్పను సూరజ్.. ఎందుకు చెప్పాలి.. నీకు సమాధానం కావాలంటే మీ తాతనే అడుగు అంటుంది జ్యోత్స్న. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు అలాగే ఉండు.. అదే మాట మీద ఉండు అంటూ చెప్పగానే.. నువ్వు వచ్చింది నా దగ్గరకు అంటూ సూరజ్ చెప్పగానే.. నా చుట్టూ తిరగొద్దు అంటే నువ్వేమైనా దేవుడివా నీ చుట్టూ తిరగడానికి అంటూ తిడుతుంది. దీంతో నువ్వు ఈ ఆఫీసులో ఉండలేవు బయలుదేరు జ్యోత్స్న మరోసారి తల దించుకోవడానికి రెడీగా ఉండు.. అంటాడు. అక్కడే ఉన్న దీప, కార్తీక్ కూడా షాక్ అవుతారు. నువ్వన్న మాటే నిజం చేస్తూ.. జ్యోత్స్న ఆఫీసులోకి వచ్చింది. ఇప్పుడు అత్తయ్య నువ్వు నేను కలిసే ఇదంతా చేస్తున్నాము అంటుంది దీప. జ్యోత్స్న ఇక్కడ పీఏగా చేరితే శివనారాయణ తాత తట్టుకోగలడా అంటుంది. అయినా ఈ మాలిని పిన్ని అన్ని సవ్యంగా జరగనిస్తుందా…? పెళ్లి ఆపేసిన వ్యక్తి జ్యోత్స్నను పీఏగా ఉండనిస్తుందా..? ఏదైనా జరగొచ్చు అంటూ కార్తీక్ చెబితే.. ఏం జరిగినా మనం నిందలు మోయడానికి రెడీగా ఉండాలి అంటుంది దీప.
మరోవైపు దక్షిణమూర్తి మేనేజర్ ను పిలిచి ఆఫీస్ స్టాప్ అందరినీ పిలవమని చెప్తాడు. మేనేజర్ స్టాఫ్ అందరినీ పిలిచి అందరూ వచ్చారు సార్ అని చెప్పగానే.. అందరికీ జ్యోత్స్నను పరిచయం చేస్తాడు. తను నా మనవరాలు, కూతురు కూతురు ఈరోజు నుంచి మన చైర్మన్ సూరజ్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా ఉంటుంది. అంటూ చెప్పి అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకుని సూరజ్ చేత సంతకం చేయించమని చెప్తాడు. మేనేజర్ సూరజ్‌కు చెబితే మా తాత మాటే నా మాట పెద్దవాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అంటూ లెటర్ మీద సంతకం చేస్తాడు సూరజ్. మాలిని షాక్ అవుతుంది. సూరజ్ సంతకం చేసిన లెటర్‌ను దక్షిణమూర్తి తీసుకుని జ్యోత్స్నకు ఇస్తుంది. ఇది నేను నీ చేతికి ఇస్తు్న్న రామబాణం అంటూ చెప్పి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోతారు. జ్యోత్స్న మేనేజర్‌ను నేను ఎక్కడ కూర్చోవాలో ఆ ఏర్పాట్లు చూడు నేను వెళ్లి మా అత్తతో మాట్లాడి వస్తాను అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.