Chandrababu Complaints to Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పూర్తి అయ్యాయి. ఈవీఎంలను ఎంపిక చేసిన యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌ల్లో వాటిని భద్రపరిచారు. ఈ అంశంపై ఇప్పుడు విషక్ష నేతలకు అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా గుంటూరు జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచారు. దానికి కూతవేటు దూరంలో నిఘా వర్గాల సమావేశం జరగడంపై టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. దీనికి ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. వర్సిటీలోని డైక్‌మెక్ ఆడిటోరియంలో నిఘా వర్గాల అధికారుల సమావేశం జరిగింది. దీనికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సిబ్బంది కూడా హాజరయ్యారు.
అధికారులు ప్రసంగిస్తున్న సమయంలో వెనుక ఉన్న స్క్రీన్‌లో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి సీఎం జగన్ ఉన్న సిద్ధం పోస్టర్ డిస్‌ప్లే అయ్యింది. దీనిపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంల సమీపంలో సమావేశం ఎందుకు నిర్వహించారన్నది టీడీపీ నుంచి బలంగా వినిపిస్తున్నమాట. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఈసీకి ఫిర్యాదు చేశారు.
Also Read: Chandrababu SPG increased : బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?
ఈ సమావేశానికి 450 మందకిపైగా పోలీసు అధికారులు పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సమావేశానికి పర్మీషన్ ఎవరిచ్చారు? వర్సిటీలో ఎందుకు పెట్టారు? ఎందుకు వైసీపీకి చెందిన సిద్ధం పోస్టర్ డిస్‌ప్లే అయ్యింది? దీనికి ముందు ఇదే వేదికపై పార్టీ సమావేశం నిర్వహించారా? గతంలో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ అక్కడే ఉంచారా? అధికారులు ఎందుకు చూసుకోలేదు? అనేది తేలాల్చి ఉంది.
Also Read: కియా.. భారీ అగ్నిప్రమాదం, భారీగా ఆస్థి నష్టం.. ఏం జరిగింది?
నాగార్జున యూనివర్సిటీని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సమావేశానికి ఎవరు అనుమతి ఇచ్చారని అంటున్నారు నేతలు. టీడీపీ ఫిర్యాదుతో కలెక్టర్, ఎస్పీలు అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. తొలుత సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ తర్వాత అధికారులు ఈసీతో మాట్లాడినట్టు సమాచారం.