Pawan Kalyan’s Wife Renu Desai Clarification on asking Rs 3500 Help: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా తన పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలాగే ఇటీవల ఏపీలో జరిగిన ఎలక్షన్లకు ముందు తన మద్దతు పవన్ కల్యాణ్‌కే అని కూడా ఆమె తెలిపింది.
దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో రేణూ పెట్టే పోస్టులకు కొంతమంది అభిమానులు ఆప్యాయంగా ‘వదినా.. వదినా’ అంటూ కూడా కామెంట్లు పెడుతారు. ఇక కొద్ది రోజుల నుంచి రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఆమెకు సంబంధించిన ఎలాంటి పోస్ట్ కూడా బయటకు రాలేదు. దీంతో ఏమై ఉంటుందా అని అంతా అనుకున్నారు.
కానీ ఒక్కసారిగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డబ్బులు సాయం కావాలని ఒక పోస్ట్ వచ్చింది. రూ.3,500 సాయం కావాలని కోరుతూ రేణూ ఇన్‌స్టా నుంచి ఒక మెసేజ్ పోస్టు వచ్చింది. ఆ పోస్టుతో పాటు క్యూ ఆర్ కోడ్ కూడా ఉంది. దీంతో ఆ పోస్టు వచ్చిన 5నిమిషాల్లోనే చాలా మంది అభిమానులు వెంటనే డబ్బులు ట్రాన్షఫర్ చేశారు. అయితే మరికొంత మంది మాత్రం సంకోషించారు. రేణూ దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
Also Read: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్
ఎందుకంటే ఆమె ఒక నటి, అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య. అలాంటి ఆమె నుంచి కేవలం రూ.3,500 సాయం కావాలని పోస్టు వస్తే ఎవరు మాత్రం నమ్ముతారు. అందువల్లనే అది ఫేక్ పోస్టు అని అనుకున్నారు. అయితే దీనిపై రేణూ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఆ పోస్టు పెట్టింది తానే అని.. తన అకౌంట్ హ్యాక్ కాలేదని క్లారిటీ ఇచ్చింది.
‘‘కొన్ని రోజుల ముందే ఫుడ్ పాయిజన్ అయింది. అందువల్ల ఆరోగ్యం బాలేదు. చాలా నీరసంగా అయిపోయాను. అందువల్లనే నేను వీడియో చేయలేకపోయాను. కానీ ఆ రూ.3500 రిక్వస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు. థాంక్యూ.. అడిగిన వెంటనే డబ్బులు ట్రాన్షఫర్ చేసినందుకు. అయితే నేను రెగ్యులర్‌గా కొంత డబ్బుని డొనేట్ చేస్తుంటాను. కానీ నాకు కూడా కొంత లిమిట్ ఉంటుంది డొనేట్ చేయడానికి. నేను నా మొత్తం డబ్బును ఇచ్చేస్తే.. నా కోసం నా పిల్లల కోసం మిగలదు. అందువల్ల నాకు తోచినంతవరకు నేను చేసిన తర్వాత.. ఆపై ఏమైనా అవసరం ఉంటే.. అప్పుడే నేను ఫాలోవర్స్‌ను అడుగుతాను’’ అని చెప్పుకొచ్చింది.
Also Read: Pushpa 2: పుష్ప 2 నుంచి అతను అవుట్.. గుంటూరు కారంలా అవ్వదుగా.. ?
అంతేకాకుండా ‘‘చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం చాలా వరకు విరాళాల రూపంలో ఇస్తాను. అయితే ఇప్పుడు ఆవుల కోసం సొంతంగా ఓ షెడ్డును కట్టిస్తున్నాను. అది ఏడాదిన్నర లోగా పూర్తవుతుంది. అప్పుడు నేనే అధికారికంగా విరాళాలు సేకరిస్తాను’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.