E-Paper
Advertisement

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం
Advertisement

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కల్యాణ్. 100 శాతం గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో అగ్రనేతలిద్దరు మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు-పవన్ భేటీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 100 శాతం గెలవాలని ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో తొలిసారి అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అగ్రనేతల మధ్య భేటీ దాదాపు రెండుగంటలపాటు సాగింది. ఈ భేటీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లు ఎవరికి ఎన్ని అన్నదానిపై కూలంకుషంగా చర్చించినట్టు ఓ ఫీలర్ బయటకువచ్చింది.

రెండు గంటలపాటు నేతలు మధ్య సుధీర్ఘ చర్చలు

Advertisement

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నిక కావడంతో వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఒకరు మేయర్ అయితే మరొకరు డిప్యూటీ మేయర్, అలాగే మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లను ఆ విధంగా షేర్ చేసుకోవాలని ఓ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. దీనికితోడు టీడీపీ-జనసేన మధ్య సమన్వయానికి జాయింట్ మెకానిజం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ బాధ్యతలను జాయింట్ కమిటీ చూడనుంది. 100 శాతం గెలుపే లక్ష్యంగా పని చేయాలని, గతంలో ఎన్నిక ఏక పక్షంగా జరిగిందని, ఇప్పుడు ఫేర్‌గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది.

జాయింట్ కమిటీలో మంత్రులు, నేతలు

బలమున్న చోట కూటమి భాగస్వామ్య పక్షాలు పోటీ చేసేలా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారట. సీట్ల సర్దుబాటులో స్థానిక ఎమ్మెల్యేల కంటే  కిందిస్థాయిలో పార్టీల బలాబలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ-జనసేన సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. అందులో పార్టీలకు చెందిన మంత్రులు, కీలక నేతలు ఉండనున్నారు.

Advertisement

ALSO READ: వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసి పని చేయాలని ఇరువురు నేతలు డిసైడ్ అయ్యారు. కూటమి ఐక్యత, సమన్వయంపై క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చినట్టు అమరావతి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Related News

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

అల్లూరి జిల్లాలో ఘోరం.. 5 నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసిన కన్నతండ్రి!

జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం

Big Stories

Advertisement
×