Dhanashree Verma: సెలబ్రిటీలు అందరూ చాలా సులభంగా విడాకులు తీసుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలు, క్రికెట్ సెలబ్రిటీలు వివాహం చేసుకోవడం చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. చాలామంది జంటలు ఈ కోవలోకి చేరుతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రముఖ క్రికెట్ హార్థిక్ పాండ్యా ( Hardik Padya) విడాకులు తీసుకున్న అనంతరం యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కూడా విడాకులు తీసుకున్నారు. ధనశ్రీ వర్మను ( Dhanashree Verma) ప్రేమించి వివాహం చేసుకున్నాడు చాహల్. ధనశ్రీ సినీ నటి మరియు కొరియోగ్రాఫర్.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
ప్రియురాలితో చాహల్ ఎంజాయ్
వీరిద్దరూ లాక్డౌన్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 2020లో వివాహం చేసుకున్నారు. రెండు సంవత్సరాల పాటు కలిసున్న వీరు 2020 నుంచి విడివిడిగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితమే విడాకులు తీసుకున్నారు. 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందుగానే ధనశ్రీ వర్మ, చాహల్ ఇద్దరు విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం చాహల్ ఆర్జె మహ్వాష్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా చాహల్ ముంబైలో ఓ ఫ్లాట్ కూడా రెంటుకు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఫ్లాట్ రెంట్ నెలకి రెండు మూడు లక్షలకు పైనే ఉంటుందని సమాచారం అందుతుంది.
తెలుగు హీరోతో ధనశ్రీ వర్మ సహజీవనం ?
ఇక మరోవైపు ధనశ్రీ వర్మ కూడా ఓ హీరోతో రిలేషన్ కొనసాగిస్తుందట. అంతేకాకుండా ఈ భామ తెలుగు సినీ పరిశ్రమకు సైతం ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాలో ధనశ్రీ వర్మ నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారుతోంది. ధన శ్రీ వర్మ ( Dhanashree Verma) టాలీవుడ్ హీరోతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. అంతే కాకుండా తొందరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
విడాకులు తీసుకోవడం ఆ తర్వాత వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం నేటి కాలంలో చాలా కామన్ అయిపోయింది. పెళ్లి జరిగి కొంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఓవైపు హార్దిక్ పాండ్యా, నటాషా సైతం ఇలానే చేశారు. వారికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నప్పటికీ అతని గురించి ఏమాత్రం ఆలోచించకుండా విడిపోయి అగస్త్య కు కో పేరెంట్స్ గా ఉంటామని అనౌన్స్ చేశారు. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అయినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టమైంది.