OTT Movie : ఒక ఆసక్తికరమైన సై-ఫై కాన్సెప్ట్‌తో, ఏలియన్ శకలాల రహస్యాలు, వాటి వింత ప్రభావాలపై ఆధారపడిన ఒక సిరీస్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. సై-ఫై సినిమాలను ఇష్టపడే వాళ్లకి ఇది ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఒటీటీలలో స్ట్రీమింగ్
‘ Debris’ 2021లో NBCలో ప్రసారమైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్. J.H. వైమన్ దీనిని సృష్టించారు. యూనివర్సల్ టెలివిజన్, లెజెండరీ టెలివిజన్ దీనిని నిర్మించాయి. ఈ సిరీస్ 2021 మార్చి 1న ప్రీమియర్ అయింది, 13 ఎపిసోడ్‌లతో ముగిసింది. ఇందులో జోనాథన్ టక్కర్ (బ్రయాన్ బెనెవెంటి), రియాన్ స్టీల్ (ఫినోలా జోన్స్), నార్బర్ట్ లియో బట్జ్ (క్రెయిగ్ మాడ్డాక్స్), స్క్రూబియస్ పిప్ (ఆన్సన్ ఆష్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ను ‘The X-Files’, ‘Fringe’ లాంటి సిరీస్‌లతో పోల్చవచ్చు. ఏలియన్ శకలాలు, వాటి అసాధారణ ప్రభావాలపై ఈ సిరీస్ నడుస్తుంది. IMDbలో 6.5/10, Rotten Tomatoes లో 72% రేటింగ్ ను ఈ సిరీస్ కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, గూగుల్ ప్లే ఓటీటీలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఆరు నెలలుగా ఒక ఏలియన్ అంతరిక్ష నౌక నుంచి శకలాలు భూమిపై పడుతుంటాయి. ఈ శకలాలు తరచూ మానవులపై, వారి పరిసరాలపై ప్రమాదకరమైన ప్రభావాలను చూపిస్తాయి. ఈ శకలాలను కనుగొని, అధ్యయనం చేయడానికి ఒక అంతర్జాతీయ ఏజెన్సీ ఇద్దరు ప్రధాన ఏజెంట్లను (CIA ఏజెంట్ బ్రయాన్ బెనెవెంటి), (MI6 ఏజెంట్ ఫినోలా జోన్స్) నియమిస్తుంది. కానీ వాళ్ల ఆలోచనా విధానాలు, శైలులు వేర్వేరుగా ఉంటాయి. బ్రయాన్ హార్డ్-కోర్ లా ఉంటే, ఫినోలా ఎమోషనల్ గుణం కలిగి ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లో బ్రయాన్, ఫినోలా ఒక కొత్త డెబ్రిస్ శకలాన్ని వెతుకుతూ, దాని వల్ల సంభవించే పరిణామాలను పరిశోధిస్తారు. ఉదాహరణకు: ఒక శకలంను ముట్టుకుంటే వాళ్లను టెలిపోర్ట్ చేస్తుంది, మరొకటి మరణించిన వ్యక్తి జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. మరొక శకలం ఒక వ్యక్తిని క్లోన్ చేస్తుంది.
కథలో ప్రధాన థీమ్ డెబ్రిస్ రహస్యాలను, దాని శక్తులను అర్థం చేసుకోవడం. కానీ ఈ శకలాల కోసం ఆర్బిటల్‌తో పాటు “ఇన్‌ఫ్లక్స్” అనే ఉగ్రవాద సంస్థ, ఆన్సన్ ఆష్ నేతృత్వంలో పోటీపడుతుంది. ఇన్‌ఫ్లక్స్ ఈ శకలాలను ఆయుధాలుగా ఉపయోగించాలని, వాటిని అందరికీ అందుబాటులో ఉంచాలని కోరుకుంటుంది. ఫినోలా తండ్రి జార్జ్ జోన్స్ ఒక ప్రముఖ సైంటిస్ట్. అతను డెబ్రిస్ గురించి రహస్యాలు తెలుసుకున్నాక చనిపోయాడని అందరూ అనుకుంటారు. కానీ అతను బతికే ఉన్నాడని, ఇన్‌ఫ్లక్స్‌తో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. బ్రయాన్‌కి కూడా ఈ విషయం తెలుసు కానీ ఫినోలాకి చెప్పకుండా దాచుతాడు.
ఇక క్లైమాక్స్ లో ఒక శక్తివంతమైన డెబ్రిస్ శకలం “ఎమోషనల్ కన్వర్జెన్స్” సృష్టిస్తుంది. ఇది ప్రజల ఎమోషన్స్‌ని ఒకచోట చేర్చి, వాటిని ఫీడ్ చేస్తుంది. జార్జ్ ఈ శకలం ఒక “మ్యాప్-మేకర్” కాదని, గేమ్-చేంజింగ్ టెక్నాలజీ అని చెబుతాడు. అతను ఏలియన్ టెక్నాలజీని ప్రభుత్వ ఆధీనంలో ఉంచకుండా అందరికీ ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే స్టోరీ ఊహించని మలుపుతో టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ ఈ ట్విస్ట్ ఏమిటి ? ఆ ఏలియన్ నౌక ఎక్కడి నుంచి వచ్చింది ? దానికి భూమి మీద ఏం పని ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : ఫ్రెండ్ భార్యపైనే కన్ను… ఆపుకోలేక అడ్డమైన పనులు… పార్ట్స్ ప్యాక్ అయ్యే క్లైమాక్స్