Gruhini Scheme: చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టనుంది. కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి’ పేరుతో స్కీమ్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు.
ఈ పథకం కింద కాపు మహిళలకు ఒక్కసారి 15 వేలు రూపాయలు ఇవ్వాలని కాపు కార్పొరేషన్ ప్రతిపాదన చెప్పుకొచ్చారు. ఈ మేరకు రూ. 400 కోట్లు అవసరమని అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం చర్చల దశలో ఉంది. దీనిపై మంచి రోజు చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్త పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తామని చెప్పకనే చెప్పేశారు.
గతంలో కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు. వైసీపీ కాపు నేస్తం పేరిట తెచ్చింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రతీ ఏటా రూ. 15వేల చొప్పున ఐదేళ్లలో 75 వేలు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ సాయం అందించారు.
ALSO READ: సినిమా హాళ్లలో తనిఖీలు, సోషల్ మీడియాలో విమర్శలు
తాజాగా కూటమి సర్కార్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కాపు మహిళకు ఆర్థిక చేయూతపై ప్రభుత్వం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మాట. గత టీడీపీ ప్రభుత్వం కూడా 2014లో కాపు కమ్యూనిటీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
దాని ద్వారా రుణాలు, సంక్షేమ పథకాలతో ఆయా మహిళలకు అండగా నిలిచిన విషయం తెల్సిందే. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందన్నమాట.