CM Chandrababu: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేసినట్లుగా భావించవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్దిపై పూర్తిగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, త్వరలోనే ఫ్రీ బస్ స్కీమ్ ను కూడ అమల్లోకి తెస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో పాలన సాగిస్తూ, ఇటీవల అధ్వాన్నంగా ఉన్న రహదారులను అభివృద్ది పరిచారు. ఓ వైపు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
కాగా న్యూ ఇయర్ సంధర్భంగా రాష్ట్ర అభివృద్ది అంశాలపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలను ఇవ్వడం జరిగిందని, వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు వెనుకాడబోమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న విమర్శలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆర్థికంగా భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ఆ తప్పులను తాము సరిచేస్తున్నామన్నారు.
అలాగే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నామని వైసీపీ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమకు ఆ ఉద్దేశమే ఉంటే, రావడం రావడమే జగన్ ను జైల్లో వేసే వారమని తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. మాజీ సీఎం జగన్ కు ఉన్న ఆలోచనలు తమకు లేవని, అటువంటి దృక్పథం జగన్ కే సొంతమన్నారు. అంతలోనే ఒక మీడియా ప్రతినిధి సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రశ్నించగా, సీఎం తనదైన శైలిలో స్పందించారు.
Also Read: AP Govt: కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం.. డబ్బులు అందినట్లే ఇక..
సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదని, దాని కంటే పెద్ద సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇటీవల సినిమా టికెట్ ధరల పెంపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, సీఎం ఇలా స్పందించడం విశేషం. అలాగే త్వరలో తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం తనిఖీలకు వస్తానని ప్రకటించడంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
సీఎం అయిన వెంటనే జగన్ ను జైల్లో పెట్టేవాళ్లం
కానీ జగన్ లా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు
సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదు
దాని కంటే పెద్ద సమస్యలు ఉన్నాయి
ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తాం
త్వరలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయి pic.twitter.com/hOfOA1ohBO
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025