Movie Theaters: ఒక్క సినిమా వల్ల టికెట్ ప్రైజ్ హైక్స్, బెనిఫిట్ షోలపై పూర్తిగా ఎఫెక్ట్ పడింది. మామూలుగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు చూడాలని, అర్థరాత్రి నుండే హడావిడి మొదలవ్వాలని ఫ్యాన్స్ ఆశపడుతుంటారు. కానీ ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మొత్తంగా ప్రీమియర్ షోలపైనే ఎఫెక్ట్ పడేలా చేసింది. అందుకే చాలావరకు సంక్రాంతి సినిమాలకు కూడా మిడ్‌నైట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఈ షోలకు అనుమతి అస్సలు ఉండదని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. మరో రోజుకు కోర్టు హియరింగ్ వాయిదా పడినా టైమింగ్స్ విషయంలో మాత్రం ఇదే ఫిక్స్ అని తీర్పునిచ్చింది.
అప్పటినుండి ఇప్పటివరకు
‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మూవీ ఇండస్ట్రీపై పెద్ద దెబ్బపడేలా చేసింది. మామూలుగా ప్రీమియర్ షోలకు ఫ్యాన్స్ రావడం, హడావిడి చేయడం, సినిమా రిలీజ్‌ను ఒక పండగలాగా సెలబ్రేట్ చేయడం అంతా కామనే. కానీ దానివల్ల తొక్కిసలాట జరిగి ఒక మనిషి ప్రాణం పోవడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే ఇకపై అలా జరగకూడదనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్ హైక్స్, బెనిఫిట్ షోలు రద్దు చేయాలని పిటీషన్ దాఖలు అయ్యింది. దాదాపు నెలన్నర నుండి ఈ కేసును తెలంగాణ హైకోర్టు పరిశీలిస్తూనే ఉంది. తాజాగా బెనిఫిట్ షోల విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది.
బెనిఫిట్ షోలు రద్దు
మామూలుగా బెనిఫిట్ షోలు అనేవి అర్థరాత్రి 01.30 గంటలకే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్నింగ్ షో పడేవరకు నడుస్తూనే ఉంటాయి. అయితే ఇకప అర్థరాత్రి 01.30 గంటల నుండి ఉదయం రూ.8.40 గంటల వరకు తెలంగాణలో ఎలాంటి ఎక్స్‌ట్రా షోలు నడిచే అవకాశం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరీ మూడో వారానికి మరో హియరింగ్‌ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని పదేపదే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పినా వారు మాత్రం యాక్సెప్ట్ చేయడానికి సిద్దంగా లేరు. బెనిఫిట్ షోలు ఉంటేనే బాగుంటుందని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బన్నీకి ఆస్కార్ ఇవ్వాలి.. సోషల్ మీడియాలో పెరుగుతున్న డిమాండ్
చర్చలు విఫలం
2025 సంక్రాంతికి కూడా మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల విషయంలో టికెట్ ప్రైజ్‌లు పెంచడానికి, ఎక్స్‌ట్రా షోలు యాడ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కొందరు సినీ ప్రముఖులు నేరుగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు పూర్తిగా సఫలం కాలేదు. టికెట్ రేట్లు మరీ ఎక్కువగా పెంచుకునే అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టారు. బెనిఫిట్ షోలు కూడా సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు. అయినా కూడా మొత్తానికే బెనిఫిట్ షోలు లేకపోవడం మేలు అని సినిమాటోగ్రాఫీ యాక్ట్ ప్రకారం వాటిని రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు (Telangana High Court). దీంతో బెనిఫిట్ షోలపై ప్రేక్షకులకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.