Prakasam: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. ఎన్నికలు అంటే వైసీపీలో వణకు వస్తోందన్నారు. వాటిని ఆపడానికి అనేక రకాలుగా న్యాయస్థానం తలుపు తడుతున్నారని అన్నారు. ఎప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.
సర్ ఉందని ఒకవైపు చెబుతారని అన్నారు. రెండో వైపు దాన్ని వ్యతిరేకిస్తూ ఉండకూదని చెబుతున్నారని అన్నారు. అది వచ్చేవరకు ఎన్నికలు పెట్టకూడదంటూ రెండు నాలుకల ధోరణిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వాళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలియదని, వారికి తెలియని భయం వెంటాడుతోందన్నారు. అన్ని సీట్లు ఓడిపోతే వచ్చే నాలుగు ఓట్లు రావని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఎన్నికలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక్కడున్నది 2014 వ్యక్తి కాదని, 1995 సీబీఎన్ అని గుర్తు చేశారు. అప్పుడు కంటే ఇప్పుడు స్పీడ్ గా ఉన్నామని, అడ్డుపడితే పక్కకు పెట్టేస్తామన్నారు. వినకపోతే పక్కకు తోసి ముందుకు వెళ్తామన్నారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు. టీడీపీకి అండగా ఉండేది వెనుకబడిన వర్గాలేనని, వారికి సామాజికంగా, ఆర్ధికంగా రాజకీయంగా పార్టీ సహకరిస్తుందని తేల్చేశారు.
మేం తీసుకువచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా గత పాలకులు వ్యవహరించారని, రిజర్వేషన్లను 24 శాతానికి కుదించటం వల్ల ఎంతో మంది నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచామని, గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు అమలు కానీయకుండా అడ్డుకుందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు-సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిందని, బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకూడదన్నది గొడ్డలి పార్టీ కుట్ర చేసి కేసులు వేసిందన్నారు.
వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని ఎప్పుడూ టీడీపీ కోరుకునేదని వివరించారు. బీసీలకు న్యాయం జరకూడదా? రిజర్వేషన్లు రాకూడదా? వారు బాగుపడకూడదనే అడ్డం పడ్డారని మండిపడ్డారు. తాము తీసుకొచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, పార్టీ పరంగా బీసీలను ఆదుకుంటామని మనసులోని మాట బయటపెట్టారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి అండగా నిలబడతామని, స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలన్నది గొడ్డలి పార్టీ ఆలోచనగా చెప్పారు.
శుక్రవారం ప్రకాశం జిల్లాలో కొండేపిలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పాలేరు నదిపై రిజర్వాయర్ స్పిల్ వే, ప్రధాన తూములు, వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అదే సమయంలో డైట్ గురించి వివరించారు సీఎం. రోజుకు ఒక్క గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదన్నారు. ఆరోగ్యంగా ఉంటారని ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. రోజుకు మూడు కోడి గుడ్లు వైట్ తో అమ్లేట్ తీసుకుంటానని వివరించారు. తాను ఈ విధంగా ఉన్నానంటే దాని వెనుక రహస్యం ఇదేనని అన్నారు.
బీసీలకు 34% కంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తాం: సీఎం చంద్రబాబు
వెనుకబడిన వర్గాల రుణం తీర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీలు బాగుపడితే టీడీపీ బలోపేతమవుతుందనే ద్వేషంతోనే రిజర్వేషన్లు అడ్డుకునేందుకు ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకు… pic.twitter.com/AmRDfKB1HD
— BIG TV Breaking News (@bigtvtelugu) October 9, 2026