E-Paper
Advertisement

కూటమి ప్రభుత్వానికి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

కూటమి ప్రభుత్వానికి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
Advertisement

Supreme court: కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు నో చెప్పింది. ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, శీల్‌నాగ్‌తో కూడి ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ జీవోను జారీ చేసింది ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన జీవోను దాఖలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని, ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆరు వారాల్లో జరపాలని పోయినవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వం అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Advertisement

బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదోపవాదనలు జరిగాయి. ఫ్యామిలీ డేటాను డెడికేటెడ్ కమిషన్ నుంచి తీసుకున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరించారు. నివేదిక ఆమోదం లేకుండా డేటా తీసుకోవడంలో హైకోర్టు కారణం సరిగానే ఉందని తెలిపింది సుప్రీంకోర్టు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత

డెడికేషన్ కమిషన్ నివేదిక అమలు చేస్తున్నట్లు ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్ దత్త-జస్టిస్ శీల్‌నాగ్ ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరపు లాయర్ ముకుల్ నివేదిక ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను దాటడానికి వీలులేదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

వైసీపీకి కూడా షాక్, అయితే సర్.. లేకుంటే పాత జాబితా ప్రకారం

Advertisement

మరోవైపు వైసీపీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిగింది సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం. ఆ పార్టీ లేవనెత్తిన ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఇచ్చిన సమయం ప్రకారం ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు సర్ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలని, లేకుంటే పాత జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించు కోవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

ALSO READ: ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం

ఈ విషయంలో హైకోర్టు తీర్పును సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.  ఈ క్రమంలో దసరా ముందుకానీ, ఆ తర్వాత నోటిఫికేషన్ ఏపీ ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

Related News

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం

దాదాపు రెండు గంటలపాటు భేటీ.. ఒత్తిడిలో పెద్దాయన, బాబు ఏం చెప్పారు?

దసరా వేళ ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. పట్టణాలకు ఆ విధంగా, గ్రామాలకు మరొకలా..

ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ

తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

Big Stories

Advertisement
×