E-Paper
Advertisement

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!
Advertisement

WhatsApp Contacts Tab: ఎమర్జెన్సీ సమయంలో ఎవరికైనా వెంటనే మెసేజ్ చేయాలన్నా.. చాట్స్ లిస్ట్‌లో ఆ కాంటాక్ట్ కోసం వెతుకుతూ సమయం వృధా అవుతోందా? వందలాది చాట్ల మధ్య పాత కాంటాక్ట్‌ను గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే వాట్సప్ యూజర్లకు త్వరలోనే ఈ సమస్యకు చెక్ పడనుంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త Contacts Tab ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

ఇకపై చాట్స్ మధ్య వెతకాల్సిన అవసరం లేకుండా, కాంటాక్ట్స్‌ను ఒకే చోట సులభంగా కనుగొనేలా ఈ ఫీచర్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ కొత్త ట్యాబ్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? యూజర్లకు ఇది ఎలా ఉపయోగపడనుందో తెలుసుకుందాం.

అన్నీ ఒకే చోట..

Advertisement

ఇప్పటివరకు మనం కొత్తగా మెసేజ్ చేయాలంటే కింద ఉండే మెసేజ్ ఐకాన్ నొక్కి వెతకాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ట్యాబ్ వస్తే చాట్స్ మధ్య వెతకాల్సిన పని ఉండదు. నేరుగా కాంటాక్ట్స్ ట్యాబ్‌లోకి వెళ్తే అందరి వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. పైన ఉండే సెర్చ్ బార్ సహాయంతో పేరు, ఫోన్ నంబర్ లేదా యూజర్‌నేమ్‌తో క్షణాల్లో కాంటాక్ట్‌ను వెతకవచ్చు. అలాగే పేరు వరుసలో లేదా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నవారిని విడివిడిగా చూసుకునే వీలుంటుంది.

Also Read: రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

ఆన్‌లైన్ స్టేటస్, బర్త్‌డే అలర్ట్స్..

Advertisement

ఈ కొత్త ఫీచర్‌లో ప్రధాన ఆకర్షణ ఆన్‌లైన్ ఇండికేటర్, బర్త్ డే రిమైండర్స్. ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉంటే వారి ప్రొఫైల్ పిక్ పక్కన గ్రీన్ డాట్ కనిపిస్తుంది. వారు ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయకపోతే లాస్ట్ సీన్ కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటు స్నేహితుల పుట్టినరోజులను గుర్తుచేసేలా పేరు పక్కన కేక్ ఎమోజీ, బర్త్‌డే నోట్ కనిపిస్తాయి. దీనివల్ల విషెస్ చెప్పడం మరింత తేలికవుతుంది.

మెటా ఏఐ, ఇన్వైట్ ఫీచర్స్..

కాంటాక్ట్స్ జాబితా కిందే మెటా ఏఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. దీనివల్ల ఏఐ టూల్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే వాట్సప్‌లో లేని స్నేహితులను యాప్‌లోకి ఆహ్వానించడానికి వీలుగా అడుగు భాగంలో ఇన్వైట్ ఫైండ్ బటన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒకే చోట ఉండటం వల్ల యాప్ వాడటం చాలా సులభంగా మారుతుంది.

ప్రైవసీకి పెద్దపీట..

ఈ కొత్త ఫీచర్లు వస్తున్నప్పటికీ యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. మీ ఆన్‌లైన్ స్టేటస్ లేదా లాస్ట్ సీన్ ఇతరులకు కనిపించకూడదని మీరు ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చుకుంటే.. ఈ కొత్త ట్యాబ్‌లో కూడా అది ఇతరులకు కనిపించదు. ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తుందో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

Tags

Related News

మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో!

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

Big Stories

Advertisement
×