E-Paper
Advertisement

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు
Advertisement

Aakash Chopra Slams India-Japan Pitch:  టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సానో అంతర్జాతీయ క్రికెట్ పిచ్ టీమిండియా కొంపముంచిందని ఆగ్రహించారు. సరిగ్గా పిచ్ రెడీ చేసి, ఉంటే 5 ఓవర్లలో 150 పరుగులు సులభంగా టీమిండియా రాబట్టేదని పేర్కొన్నారు. చిన్నగా ఉన్న జపాన్ గ్రౌండ్ లో బలమైన టీమిండియా ఇరగదీసేదని చెప్పుకొచ్చారు. టీమిండియాలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి భయంకరమైన హిట్టర్లు ఉన్నారని, పిచ్ సరిగ్గా ఉండింటే.. ఈ ముగ్గురు జపాన్ కు చుక్కలు చూపించేవారన్నారు. కానీ వర్షం పడటంతో పిచ్ ను సరిగ్గా తయారు చేయడంలో జపాన్ విఫలమైందని సీరియస్ అయ్యారు. పిచ్‌ను పొడిగా మార్చేందుకు అత్యాధునిక పరికరాలను జపాన్ వాడకపోవడం విడ్డూరంగా ఉందంటూ హేళన చేశారు ఆకాశ్ చోప్రా.

అభిషేక్‌ను ఎవరూ తిట్టొద్దు…వర్షం పడకపోయింటే, సెంచరీ కొట్టేవాడు

టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. అంతకు ముందు టీమిండియా వర్సెస్ ఆఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20లో మాత్రం మనోడు సెంచరీతో ఇరగదీశాడు. అయితే, జపాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మాత్రం అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా అభిషేక్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. కానీ అభిషేక్ శర్మకు ఆకాశ్ చోప్రా సపోర్ట్ గా నిలిచాడు. అభిషేక్‌ను ఎవరూ తిట్టొద్దు…వర్షం పడకపోయింటే, సెంచరీ కొట్టేవాడంటూ వెల్లడించారు. పిచ్ ప్రమాదంగా ఉన్న తరుణంలో ఏ ఆటగాడు కూడా సక్సెస్ కాలేరని తెలిపారు. అభిషేక్‌ కూడా అందుకే విఫలమైనట్టు పేర్కొన్నారు. వర్షం పడి, ఆగిపోయినా పిచ్ తడిగా ఉందన్నారు. అసలు పిచ్ ఆరబెట్టే ప్రయత్నం జపాన్ చేయలేదని సీరియస్ అయ్యారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

జపాన్ మ్యాచ్ పై పాకిస్తాన్ వింత వాదన

ఇండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ ఫలితం పై తన్వీర్ అహ్మద్ లాంటి పాకిస్తాన్ మాజీలు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్ లో అంతిమ విజయం జపాన్ దే అని వ్యాఖ్యానిస్తున్నారు. చీటింగ్ చేసి టీమ్ ఇండియా గెలిచిందని ఆరోపణలు చేస్తున్నారు. అక్షర్ పటేల్ వేసింది వైడ్ అయినప్పటికీ.. అంపైర్ ను బెదిరించి, కౌంట్ బాల్ గా మార్చుకున్నారని సీరియస్ అవుతున్నారు. అదే బాల్ వైడ్ గా మారి ఉంటే.. జపాన్ మ్యాచ్ గెలిచేదని స్పష్టం చేస్తున్నారు. పరువు పోతుందనే భయంతో అంపైర్ ను వీధి రౌడీల లాగా బెదిరించారని టీమిండియా ప్లేయర్లపై ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీలు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

ఐపాడ్ లో పాటు వింటూ 300 బాదేసిన వీరేంద్ర సెహ్వాగ్

పాకిస్తాన్ వెళ్లిన రాజీవ్ శుక్లా…ఇంజామామ్ తో బిర్యానీ పార్టీ కూడా!

గ్యారీ కిర్‌స్టెన్ పీకింది లేమీ లేదు…2011 వ‌ర‌ల్డ్ క‌ప్ అత‌ని వ‌ల్ల రాలేదు

టీమిండియా మ‌హిళ‌ల గోల్డ్ మెడ‌ల్స్ దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ ?

అంపైర్ మెడపై కత్తి పెట్టి బెదిరించి, టీమిండియా గెలిచింది

ఇంట్లో పిల్లి, బ‌య‌ట మాత్రం పులి.. అభిషేక్ శర్మ పరువు తీసిన ఇంజమామ్

రివర్స్ స్లీప్ ఆడితే, వైడ్ బాల్ రూల్స్ మార‌తాయి..మాజీ అంపైర్ అనిల్ క్లారిటీ

Big Stories

Advertisement
×