HBD Santhanam :ప్రముఖ కోలీవుడ్ నటుడు, హీరో, కమెడియన్ సంతానం (Santhanam) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇటు ఆ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈయన పుట్టినరోజు నేడు. 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు, ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషకం వైరల్ గా మారుతున్నాయి.
సంతానం సినిమా కెరియర్..
1980 జనవరి 21న చెన్నైలో జన్మించిన సంతానం. మొదటిసారి విజయ్ టీవీలో ప్రసారమైన ‘లోల్లు సభా’ అనే షో తో తనదైన శైలిలో కామెడీ చేస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఈ షోలో సంతానం కామెడీని మెచ్చిన హీరో శింబు ( Hero Simbu). ఆయనకు ‘వల్లవన్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు ఈ సినిమా విజయం సాధించడంతో సంతానం కెరియర్ ఓపెన్ అందుకుంది. దాంతో ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) కూడా ‘ఈగ’ సినిమా కోసం సంతానం కాల్ షీట్ కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి అంటే సంతానం ఏ రేంజ్ లో కమెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
సంతానం హీరోగా నటించిన చిత్రాలు..
ముఖ్యంగా సంతానం నటిస్తే.. అందులో కామెడీ చేస్తే తప్పకుండా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం అటు ఆడియన్స్ లో కూడా బలంగా పాతుకుపోయింది. ప్రస్తుతం కామెడీ చేయడం మానేసి హీరోగా నటించడం మొదలుపెట్టారు. అలా అరై ఎన్ 305 11 కాదవుల్, కన్నా లడ్డు తిన్న ఆశయ్యా వంటి హాస్య చిత్రాలలో హీరోగా నటించి.. ఇకపై కామెడీ పాత్రలు చేయనని ప్రకటించారు.
దీంతో ఆయన రేంజ్ లో కామెడీ చేసేవారు తమిళంలో కరువయ్యారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ‘డిడి రిటర్న్స్’ రెండో భాగంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్య నిర్మిస్తున్నారు. సెల్వ రాఘవన్, గౌతమ్ మేనన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi choudhary) హీరోయిన్గా నటిస్తోంది.
సంతానం ఆస్తుల విలువ..
సంతానం ఆస్తుల విలువ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నారు. ఇక ఆయన ఆస్తి విలువ సుమారుగా రూ.90కోట్లు ఉంటుందని సమాచారం. చెన్నైలో సొంత బంగ్లా తోపాటూ అనేక లగ్జరీ కార్లు కూడా ఈయన సొంతం.2004లో ఉషా (Usha) ను వివాహం చేసుకున్న సంతానంకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటనతో పాటు ఆధ్యాత్మికత పైన కూడా ఆసక్తి ఉన్న ఈయన సద్గురు భక్తుడు కూడా. ఇకపోతే సంతానం కామెడీకి పులిస్టాప్ పెట్టడంతో ఈ కొత్త ఏడాది అయినా మళ్లీ సినిమాలలో కమెడియన్ గా నటించాలని అభిమానులు కోరుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకైనా సంతానం మళ్ళీ కమెడియన్గా నటిస్తాడా లేదా అన్నది చూడాలి. దాదాపు 12 ఏళ్ల క్రితమే విడుదల అవ్వాల్సిన విశాల్(Vishal) ‘మదగజరాజు’ సినిమా ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ కామెడీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో మరొకసారి ఈ సినిమా నిరూపించింది. మరి ఇప్పటికైనా సంతానం కం బ్యాక్ అవుతారో లేదో చూడాలి.