E-Paper
Advertisement

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్
Advertisement

Kuppam: డీఎస్సీ పేరుతో వైసీపీ చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో మీ బట్టలూడదీసే ధైర్యం మాకుందన్నారు. పిచ్చిపిచ్చిగా ఆటలాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అసెంబ్లీకి రావడానికి భయం ఉంటే న్యాయస్థానాలకు వెళ్లవచ్చన్నారు. సాక్షాలుంటే న్యాయస్థానాలు డైరెక్షన్ ఇస్తే.. దేనికైనా మేం సిద్ధమేనన్నారు.

కుప్పంలో సీఎం చంద్రబాబు టూర్

తాము మెగా డీఎస్సీ పెట్టామని, అక్కడ సీబీఎన్ ఉన్నారని, అవినీతి జరిగే సమస్యే ఉండదని కుండబద్దలు కొట్టేశారు. నా హయాంలో ఎక్కడైనా పేపర్ లీక్ కానీ, మానిప్యులేట్ చేయడం కాని జరగలేదన్నారు. ఎన్నో డీఎస్సీలు నిర్వహించామని, తన హయాంలో ఎక్కడా పేపర్ లీక్ అయిన సందర్భాలు లేవన్నారు. అదే జరిగితే వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. 14 సార్లు డీఎస్సీని పెట్టామని, గతేడాది డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 355 పిటిషన్లు వేశారని, ఉద్యోగాలు రాకుండా చేశారన్నారు.

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది-సీఎం

Advertisement

ఒక్కసారి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. ఏడాది తర్వాత కుక్కలు మెరిగిన ఆరు నెలలకు ఇప్పుడు వచ్చారన్నారు. ధైర్యముంటే జే బ్రాండ్స్, ఏపీపీఎస్సీ అవకతవకలపై సమాధానం చెప్పాలన్నారు. వాటికి సమాధానాలు చెప్పరని, ఇక్కడకు వచ్చి రౌడీయిజం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారని, రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అనే గొడ్డలి పార్టీకి ఒక్క స్థానం రాకుండా చేయాలని ఓటర్లకు చెప్పుకొచ్చారు. వారికి అదే నిజమైన సమాధానమని చెప్పుకొచ్చారు.

పిచ్చిపిచ్చిగా ఆటలాడితే చూస్తూ ఊరుకోమని సీఎం హెచ్చరిక

రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు లేదని, నేరాలు-ఘోరాలు స్థానం లేదన్నారు. కేవలం అభివృద్ధికి మాత్రమే స్థానముందన్నారు. వార్డు మెంబరు, కౌన్సెలర్‌గా వైసీపీ గెలవకుండా చేయాలన్నారు. వారిది రాజకీయ పార్టీ కాదని, దాని ముసుగులో నేరస్తులను పెంచే పార్టీ అని విమర్శించారు. నేరాలను ప్రొత్సహించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మత మార్పిడులు చేసే పార్టీ అని మండిపడ్డారు. వివేకానందను చంపి ఆ గొడ్డలి తన చేతిలో పెట్టి పిచ్చిరాతలు రాశారన్నారు. ఇకపై అలాంటివి జరగవన్నారు.

Advertisement

ALSO READ: విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ.. వైసీపీ vs టీచర్లు, రంగంలోకి దిగిన పోలీసులు, మంత్రి ఆగ్రహం

ఇప్పటికే రాష్ట్రం నష్టపోయిందని, ఈ విషయంలో ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. దక్షిణ భారత్ లో ఏపీ చాలా వెనుకబడి ఉందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేశామని, విభజన జరిగిన కొన్ని కాపురానికి శ్రీకారం చుట్టామన్నారు. తన మాటపై నమ్మకంతో రైతులు 70 వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. నమ్మకం అంటే అదని అన్నారు. కుప్పంలో ఎయిర్ పోర్టు వస్తుందని, తొందరలో పని ప్రారంభిస్తున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. కుప్పం టూర్ లో భాగంగా సోమవారం స్వర్ణ కుప్పం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కుప్పం తనకు రాజకీయ జన్మ ఇచ్చిందన్నారు. 40 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారని, ఏ పని చేయాలన్నా ఇక్కడి నుంచి ప్రారంభిస్తామన్నారు.

Related News

సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ నిర్ధారణ!

విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ.. వైసీపీ vs టీచర్లు, రంగంలోకి దిగిన పోలీసులు, మంత్రి ఆగ్రహం

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×