Vijayawada: ఏపీలో రాజకీయాలు డీఎస్సీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని జఠిలం చేయాలని వైసీపీ చూస్తుండగా, దాన్ని ఆపాలని డిసైడ్ అయ్యారు ఉపాధ్యాయులు. దీంతో ఇరువర్గాల నిరసనలు, తోపులాటతో విజయవాడ నడిబొడ్డున పెద్ద రచ్చ అయ్యింది. పరిస్థితి గమనించిన పోలీసులు, ఇరువర్గాలను అదుపు చేయడానికి రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగింది?
గతేడాది ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పదేపదే వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై రోజుకో కొత్త కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. అందుకు ధీటుగా ప్రభుత్వం తరపున అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. గడిచిన మూడు నెలలుగా ఈ తతంగా జరుగుతోంది. అధికారులు పదేపదే సమాధానాలు ఇచ్చినా వైసీపీ ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో శాప్ ఆఫీసులో మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాలపై పదే పదే వైసీపీ విషం చిమ్మడాన్ని ఉపాధ్యాయులు తట్టుకోలేకపోయారు. వైసీపీ నిరసనలకు ధీటుగా వారు కూడా రోడ్లపై వచ్చారు. గడిచిన కొన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ లో సోమవారం శాప్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు, కార్యకర్తల నిరసనగా ఆఫీసును చుట్టుముట్టే ప్రయత్నం చేశారు.
దీన్ని గమనించిన కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు, తోపులాటతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకు అనుమతి లేదని ఆదివారం విజయవాడ పోలీసులు వైసీపీ నేతలకు చెప్పారు. అయినా నేతలు వస్తున్న విషయం తెలుసు కున్న పోలీసులు, బారికేడ్ లను అడ్డం పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. శాప్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు టీచర్లు.
ALSO READ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?
ఈ క్రమంలో వైసీపీ నేతలు- ఉపాధ్యాయుల మధ్య తోపులాట జరిగింది. శాప్ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నాన్ని ఒకరినొకరు అడ్డుకుంటున్నా రు. వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, శాప్ ఎండీ భరణిలకు వినతిపత్రం ఇవ్వాలని వచ్చారు టీచర్లు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నారు. పలువురు టీచర్లపై వైసీపీ కార్యకర్తల రాళ్లు, వాటర్ బాటిల్స్‌తో దాడి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇరువర్గాలను శాప్ కార్యాలయం నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు.
శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతల అల్లర్లను తీవ్రంగా ఖండించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దేవినేని అవినాష్, జోగి రమేష్ లు తమ గ్యాంగులతో శాప్ కార్యాలయం వద్ద రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం హేయమైన చర్యగా వర్ణించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉద్రిక్తత సృష్టించడం తగదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వైసీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
విజయవాడలో ఉద్రిక్తత.. DSC అక్రమాలపై శాప్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నేతలు#Vijayawada #YCPProtest #DSC #bigtv pic.twitter.com/mXE0ZvCHMr
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2026