Big Stories

Geethanjali Malli Vachindi: OTTలో స్ట్రీమింగ్‌‌‌కి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఆలస్యం.. ఎందుకంటే?

Geethanjali malli vachindi OTT release date: తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. గతంలో 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ హారర్ కామెడీ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందించారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో సీక్వెల్స్‌కు డిమాండ్ బాగా ఉండటంతో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ సూపర్ రెస్పాన్స్‌ను అందుకోవడంతో ఈ మూవీపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ మేరకు థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అయింది.

- Advertisement -

దాదాపు రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పూర్తి థియేట్రికల్ రన్‌లో రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నటి అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి హిట్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను ఇది కొలాప్స్ చేసింది. దీంతో థియేట్రికల్ రన్ అనంతరం ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

Also Read:  ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. ఈ సారి భయపెట్టిందా ..? లేక బయపదిందా..?

ఇందులో భాగంగానే ఈ చిత్రం ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమైంది. అయితే అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా బుధవారం (మే 8) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవల తెలిపింది. దీంతో ఈ మూవీ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మధ్యాహ్నం దాటినా ఇంకా స్ట్రీమింగ్‌కు రాలేదు. అయితే సమాచారం ప్రకారం.. రాత్రి 9 గం.కు ప్రారంభం అవుతుందని చర్చించుకుంటున్నారు. కానీ దీనిపై ఆహా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

కాగా ఈ మూవీ రిలీజ్‌కు ముందు కోన వెంకట్ ఆహాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా థియేటర్లలో విడుదలైన ఒక నెలలోపే OTTలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ డీల్‌తో కోన వెంకట్ పోస్ట్ థియేట్రికల్ హక్కులను మంచి ధరకు విక్రయించాడు.

దీంతో ఈ హారర్ అండ్ కామెడీ చిత్రాన్ని అప్పుడు థియేట్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు అనుకున్నారు. ఈ మూవీలో సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News