OTT Movie : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే గ్యాంగ్ స్టర్ డ్రామాలు లేదా సైకాలజికల్ థ్రిల్లర్స్ గుర్తొస్తాయి. అందులోనూ యాక్టర్స్ మాత్రమే మెయిన్ లీడ్స్ గా దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ది క్లీనింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఓ అమ్మాయి కథ ఈరోజు మన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఆ అమ్మాయి ఏం క్లీన్ చేస్తుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. మరి ఈ మూవీ కథ, దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కాంబోడియన్-ఫిలిపినో మాజీ సర్జన్ అయిన థోనీ డి లా రోసా స్టోరీ ఇది. ఆమె తన 5 సంవత్సరాల కొడుకు లూకా లాసల్లెకు ఉన్న అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికాకు వస్తుంది. కానీ ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత లాస్ వేగాస్ లో డాక్యుమెంట్ లేని వలసదారుగా చిక్కుకుంటుంది. ఇక చేసేది లేక ఆమె తన బావమరిది ఫియోనా (మార్తా మిల్లన్)తో కలిసి క్లీనింగ్ సర్వీస్ వర్కర్‌గా జీవనం సాగిస్తుంది. ఒక రోజు థోనీ ఒక హత్యను చూస్తుంది. నేరస్థుడైన అర్మాన్ మోరల్స్ ఒక గ్యాంగ్‌స్టర్. ఆమెను తన కొడుకు చికిత్స కోసం డబ్బు సంపాదించడానికి క్రిమినల్ సంస్థలో క్లీనర్‌గా, డాక్టర్‌గా పని చేయమని డీల్ కుదుర్చుకుంటాడు.
ఇంకేముంది థోనీ తన కుటుంబం దగ్గర ఈ విషయాన్ని దాస్తూ, క్రిమినల్ అండర్‌వరల్డ్‌లో రెండు జీవితాలను జీవిస్తుంది. తన తెలివితేటలను ఉపయోగించి చట్టాన్ని తప్పించుకుంటూ, తన కొడుకు జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంది. FBI ఏజెంట్ గారెట్ మిల్లర్ (ఆలివర్ హడ్సన్) అర్మాన్‌ను పట్టుకోవడానికి థోనీని వెంబడిస్తాడు. ఇది ఆమెను మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మరి క్రిమినల్ ప్రపంచంలో ఆమె చేసిన పనులు ఏంటి? చివరికి కొడుకుని కాపాడిందా ? ఎఫ్బీఐ ఏజెంట్ అర్మాన్ ను పట్టుకున్నాడా? క్లైమాక్స్ ఏంటి ? అనేది తెరపై చూడాల్సిందే.
Read Also : పాపం ఈ సైకోలు… కిల్లర్ గర్ల్ తో పెట్టుకుని అడ్డంగా బుక్… డెడ్లీ డెత్ గేమ్
ఓటీటీ వివరాలు
ఇదొక ఇంటెన్స్ అమెరికన్ క్రైమ్ డ్రామా. ఈ సిరీస్ పేరు ‘ది క్లీనింగ్ లేడీ’ (The Cleaning Lady). దీన్ని 2017లో విడుదలైన అర్జెంటీనియన్ సిరీస్ La Chica Que Limpia ఆధారంగా మిరాండా క్వాక్ రూపొందించారు. నాలుగు సీజన్‌లు నడిచిన ఈ సిరీస్ చివరి భాగం 2025 జూన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సిరీస్ హులు (Hulu), మాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. హౌజ్ కీపింగ్ పేరుతో ఈ లేడీ చేసే అరాచకాన్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే భయ్యా.