Ananya Panday: స్టార్ దర్శకులతో సినిమాల్లో ఛాన్సులు రాగానే యంగ్ హీరోయిన్స్ అయినా, స్టార్ హీరోయిన్స్ అయినా వెంటనే దానికి ఒప్పుకోవడానికే సిద్ధంగా ఉంటారు. కానీ కొందరు అలా కాదు.. స్టార్ దర్శకులతో సినిమాలు చేయడం కంటే వారికి నచ్చింది చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే కూడా అదే చేస్తోంది. స్టార్ దర్శకుడితో సినిమా ఛాన్స్ వచ్చి, తన రేంజ్ వేరే లెవెల్‌కు వెళ్తుందని తెలిసినా.. ఒక యంగ్ హీరోతో సినిమా చేయడం కోసం ఆ గోల్డెన్ ఛాన్స్‌ను పక్కన పెట్టేసిందట అనన్య. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. అనన్య అసలు అలా ఎందుకు చేసిందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
ఎందుకలా చేస్తోంది.?
బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) సినిమాలు అంటే యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన తెరకెక్కించే ప్రేమకథల్లో ఒక్కసారి నటిస్తే చాలు అని హీరోహీరోయిన్లు అనుకుంటారు. అలా యంగ్ బ్యూటీ అనన్య పాండేకు కూడా ఇంతియాజ్ అలీ అప్‌కమింగ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందని, అయినా అది తాను రిజెక్ట్ చేసందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అనన్య చేతిలో పలు ఓటీటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఓటీటీ ఫిల్మ్స్‌తోనే బిజీగా ఉంది ఈ బ్యూటీ. తను చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించే సినిమా విషయంలో అనన్య పాండే (Ananya Panday) తప్పటడుగు వేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఆ సినిమా వద్దు
నజీరుద్దీన్ షా, దిల్జీత్ దోశాంజ్, వేదాంగ్ రైనా కాంబినేషన్‌లో ఒక పీరియాడిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని ఇంతియాజ్ అలీ డిసైడ్ అయ్యాడు. అందులో హీరోయిన్‌గా అనన్య పాండేను ఎంపిక చేశాడు. అయితే అనన్య మాత్రం ఇంతియాజ్ సినిమాను పక్కన పెట్టి కార్తిక్ ఆర్యన్‌తో ఒక లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమయ్యింది. ఇలా చేయడం తన కెరీర్‌పై ఎఫెక్ట్ పడేలా చేస్తుందని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అసలు విషయం వేరే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యిందని, అందుకే అనన్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
Also Read: పాట పాడమని కోరిన ఫ్యాన్.. స్టేజ్‌పైనే సీరియస్ అయిన హీరోయిన్..
కెమిస్ట్రీ బాగుంది
కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న చిత్రమే ‘తూ మేరీ మే తేరా మే తేరా తూ మేరీ’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఇందులో హీరోయిన్‌గా అనన్య పాండే నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జోడీగా ‘పతీ పత్నీ ఔర్ వో’ మూవీ వచ్చింది. ఆ సినిమాలో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించినా కూడా కాస్త పరవాలేదనిపించింది. అందులో వీరి కెమిస్ట్రీని ఇష్టపడిన కరణ్ జోహార్.. మరోసారి వారిని ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో క్యాస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.