Robinhood Release Date: ఒక సినిమా కోసం ఒక రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినా అదే తేదీకి ఆ మూవీ విడుదల అవుతుందనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా ఈరోజుల్లో సినిమాలు చెప్పిన తేదీకి విడుదల అవ్వడం అసాధ్యంగా మారింది. మామూలుగా విడుదల తేదీ వాయిదా పడడమే ట్రెండింగ్‌గా మారిపోయింది. మరికొన్ని సినిమాలు అయితే ఒకటి కాదు రెండు, మూడు సార్లు కూడా వాయిదా పడుతున్నాయి. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’కు కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. అసలైతే ఈ సినిమా గతేడాదిలోనే విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఫ్యాన్స్ సెంటిమెంట్
చాలావరకు యూత్‌కు దగ్గరయ్యే కథలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నితిన్. కానీ నితిన్‌కు ఒక్క హిట్ పడగానే వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వచ్చేస్తున్నాయి. ఇది తనకు మాత్రమే కాదు.. తన ఫ్యాన్స్‌కు కూడా సెంటిమెంట్‌లాగా మారిపోయింది. ఒక సినిమా హిట్ పడింది అనుకునేలోపు వెంటనే ఫ్లాప్స్ వచ్చేస్తున్నాయి. నితిన్ చివరిగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023లో విడుదలయిన ఈ సినిమా డిశాస్టర్‌గా నిలిచింది. దీంతో తన తరువాతి సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ‘రాబిన్‌హుడ్’ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ బయటికి వచ్చింది.
రిలీజ్ డేట్ ప్రకటన
నితిన్ (Nithiin), వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఇప్పటికే ‘భీష్మ’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే వీరి కాంబినేషన్‌లో వచ్చే ‘రాబిన్‌హుడ్’ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల అవుతుందని ముందుగా ప్రకటించారు మేకర్స్. లేకపోతే క్రిస్మస్‌కు అయినా మూవీ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ పలు కారణాల వల్ల సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇన్నాళ్ల తర్వాత ‘రాబిన్‌హుడ్’ మూవీ మార్చి 28న విడుదలకు సిద్ధమయ్యిందని ప్రకటించి నితిన్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు.
Also Read: దీపికా రెడీ అవ్వడానికే సరిపోయింది.. మరోసారి కంగనా షాకింగ్ కామెంట్స్
అదే నమ్మకం
‘రాబిన్‌హుడ్’ (Robinhood) అనేది ఒక క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న సినిమా అని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ముందుగా ఈ మూవీలో రష్మిక మందనా హీరోయిన్ అని చెప్తూ ఒక అఫీషియల్ వీడియో కూడా విడుదల చేశారు. కానీ అప్పటికే రష్మికకు వేరే కమిట్మెంట్స్ ఉండడం, ఈ మూవీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల తను తప్పుకుంది. అలా ఈ ఛాన్స్ శ్రీలీల చేతికి వచ్చింది. వెంకీ కుడుముల మునుపటి సినిమాలలాగానే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడని ‘రాబిన్‌హుడ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేసింది.