BigTV English
Advertisement

AP Politics: ఏపీలో హాట్ టాపిక్ గా ఉత్తరాంధ్ర రాజకీయం..

AP Politics: ఏపీలో హాట్ టాపిక్ గా ఉత్తరాంధ్ర రాజకీయం..

Differences Between YSRCP Leaders At Uttarandhra(AP political news): ఏపీలో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లోకల్ లీడర్స్ నుంచి స్టేట్ లీడర్స్ వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పుడు విభేదాలు భగ్గుమంటున్నాయి. పవర్ ఎలాగో పోయింది. పార్టీ పగ్గాలనైనా చేజిక్కించుకోవాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా పగ్గాలు చేపట్టడానికి ఓ మాజీమంత్రి పావులు కదుపుతున్నారు. ఆ మంత్రి ఎవరు ? ఆ వ్యవహారం ఏంటో చూద్దాం..


ఏపీలో ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో ఎటువైపు చూసినా వైసీపీ నాయకులే కళ్లకు కనిపించే వాళ్లు. వారేమి సాదాసీదా వ్యక్తులు కాదు. రాజకీయాల్లో ఉద్ధండులుగా ముద్ర పడిన వాళ్లు.. గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్రను ఏలుతున్న వాళ్లు. వారు ఎవరో కాదు.. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్. వీళ్లు తలుచుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ఈజీగా తమ వైపు తిప్పేసుకోగలరు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం లేకపోయినా కూడా ఆ ప్రాంతంలో వీళ్ల మాట చెల్లుబాటు అవుతుంది. గత వైసీపీ హయాంలో వారిలో ముగ్గురు మంత్రులుగా పని చేశారు. గత ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ ధీమాతో ఉన్న నేతలు.. ఘోర ఓటమితో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారం పోయిన పార్టీలో కనీసం తమ పరపతిని అయినా నిలబెట్టుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమిపై ఒకపక్క సమీక్షలు నిర్వహిస్తుంటే.. మరోవైపు జిల్లాల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానిక నాయకత్వం ఓటమి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటమికి గల కారణాలతో పాటు వర్గ విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రను నడిపించే రథసారథి ఎవరనే కొత్త ప్రశ్న వైసీపీ నాయకత్వంలో మెదులుతుంది.


విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న కోలా గురువులను తప్పించి ఆ స్థానంలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమించాలనే కొత్త ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్ గా జరిగిన విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ ను జిల్లా అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్ వచ్చింది. దీంతో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం అమర్నాథ్ ని విశాఖ జిల్లా అధ్యక్షుడిని చేయాలని కోరుతుంటే మరో వర్గం వద్దంటూ వ్యతిరేకిస్తుంది. దీంతో జిల్లా వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

Also Read: డెవిల్‌ కంట్రోల్.. ఆ రెండింటితో సంతోషమే, మీడియాతో సీఎం చంద్రబాబు..

గుడివాడ అమర్నాథ్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వైసీపీ నాయకులు మాత్రం.. ఆయనను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పార్టీకి గత వైభవం తిరిగి వస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. వైవీ స్థానికుడు కాకపోవడం.. ఉత్తరాంధ్రలో కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లకే పరిమితం కావడంతో స్థానిక వ్యక్తినే రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవితో పాటు.. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథే.. సరైన వ్యక్తి అని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకులుగా ఉన్న బొత్స, ధర్మాన బ్రదర్స్, అవంతిలు.. పార్టీ ఓటమితో కొంత నిరుత్సాహంతో ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల్లో తమకు జూనియర్ గా ఉన్న అమర్నాథ్ ను.. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా చేయాలని డిమాండ్ స్థానిక నాయకత్వం నుంచి వస్తుండడంతో.. సీనియర్లు సైతం ఆలోచనలో పడినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారం లేకపోయినా పార్టీ పగ్గాలు చేతిలో ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్న స్థానిక నాయకుల నుండి కీలకమైన నాయకుల వరకు తాము చెప్పినట్టు వింటారనే భావనలో.. ఆ నలుగురు సీనియర్లు కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండడానికి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ధర్మాన బ్రదర్స్ గాని, బొత్స గాని, అవంతి కానీ సైలెంట్ గా వ్యవహరిస్తారని పేరు ఉంది. పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన ఇవ్వకపోయినా.. ప్రస్తుతం కూటమి సర్కారుని ఎదుర్కోవాలి అంటే దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఉన్న వారైతే బెటర్ అని ఆలోచనలో పడ్డారట. దాంతో అందుకు గుడివాడ అమర్నాథే సరైన వ్యక్తి అనే ఆలోచన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది

మరోవైపు జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వైవీ సుబ్బారెడ్డిని.. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించలేక.. అటు సీనియర్లని కాదనలేక.. ఇటు జూనియర్ కి పగ్గాలు అప్పగించే అవకాశం లేక.. ఉత్తరాంధ్ర వైసీపీ విషయంలో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట జగన్. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో అనేది ఒకవైపు ఉంటే.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అధికారం ఉన్న లేకపోయినా మకుటం లేని మహారాజుగా వెలుగుందిన బొత్సాను, ధర్మాన బ్రదర్స్ ని కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక అయోమయంలో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి

నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి సీఎంగా, వైసీపీ అధ్యక్షుడిగా తన మాటే వేదం అంటూ ఆదేశాలిస్తూ వచ్చిన జగన్ ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు కీలకమైన జిల్లాగా ఉన్న విశాఖపట్నం నుంచి పార్టీని నడిపిస్తే.. రానున్న రోజుల్లో కూడా వైసీపీ మనుగడ సాధ్యమవుతుందని భావిస్తున్నారట. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తన సన్నిహితులు దగ్గర చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

మొత్తానికి పదవుల కోసం పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి తరుణంలో సీనియర్ నాయకుల్ని కాదని జూనియర్ గా ఉన్న అమర్నాథ్ కి జగన్ ఈ బాధ్యతలు అప్పగిస్తారా ? లేక వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా కొనసాగిస్తూ.. ఉత్తరాంధ్రలోని జిల్లాలకు ఆయా ముఖ్య నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించి జగన్ ప్రస్తుతానికి చేతులు దులుపుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వైసీపీ అధినేత జూనియర్ కి పగ్గాలు అప్పగిస్తే సీనియర్లు సహకరిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయం ఎలా మలుపు తిరగబోతుందో అని చర్చ జరుగుతుంది.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×