CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ తండ్రి హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ నేతగా పని చేసిన ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
‘మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు ఆనంతన్ ను కొల్పోవడం బాధాకరం. అనంతన్ శాసనసభ, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారు. అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సీఎం రేవంత రెడ్డి పేర్కొన్నారు. అనంతన్ మృతి పట్ల మంత్రి కొండా సురేఖ కూడా సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ మరణం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అనంతన్ నాలుగు సార్లు అసెంబ్లీకి, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు. ఇక తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మాజీ గవర్నర్ తమిళ సై కి, వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు సంతాపం తెలిపారు.
ALSO READ: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో జాబ్.. జీతమైతే రూ.74,000
ALSO READ: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..