Namaz in Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేసుకోవడం తీవ్ర దుమారంగా రేపుతోంది. టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ చేస్తున్నారు. నమాజ్ చేసుకున్న వ్యక్తిని చెన్నైకు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. అతని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తిరుమల టు టౌన్ పోలీసులు తెలిపారు.
అయితే నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చెనై నుంచి తిరుమలకు భక్తులను తీసుకువచ్చిన డ్రైవర్. యాత్రికులు శ్రీవారిని దర్శనానికి వెళ్లినప్పుడు, డ్రైవర్ తన కారును కళ్యాణ వేదిక వద్ద పార్క్ చేసి వేచి ఉన్నాడు. అతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కావడంతో, మధ్యాహ్న ప్రార్థన సమయానికి కళ్యాణ వేదిక పక్కన ఖాళీ స్థలంలో ప్రార్థన చేశాడు. తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి సిబ్బంది ఎవరూ దీనిని గుర్తించకపోవడం గమనార్హం.
అత్యంత పవిత్రమైన తిరుమల ప్రాంగణంలో అన్యమతస్థుడు వెళ్లి నమాజ్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమాజ్ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనా కూడా.. అక్కడ ఉన్న ఎవరూ పట్టించుకోలేదని.. ఇది సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే అధికారులు తెలిపారు. అతను కావాలని చేశాడా లేదా అమాయకుడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: ముంబైలోనే ప్లాన్ అంతా ! మతఘర్షణలు సృష్టించి.. సూసైడ్ బాంబర్‌గా.. సిరాజ్ కేసులో సంచలనాలు
తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్థనలు చేయడం వెంకన్న స్వామికి అపచారం చేయడమేనని భక్తులు మండిపడ్డారు. గత ఘటనల దృష్ట్యా ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.
ఇదెలా ఉండగా.. ఇది వైసీపీ నాయకుల పనే అని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దీని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. భగవంతుడిని అడ్డుపెట్టుకుని ఇలా రాజకీయం చేయడం సరికాదని వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.