Ram Gopal Varma :సమాజమంతా ఒకవైపు అంటే.. తాను మరోవైపు అనే అతి తక్కువ మందిలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మొదటి స్థానంలో ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడే వర్మ.. సామాన్య వ్యక్తులు మాట్లాడడానికి కూడా వెనకడుగు వేసే విషయాలపై చాలా ధైర్యంగా తన మనసులో మాటలుగా చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా బూతు సన్నివేశాలపై ఎక్కువగా మాట్లాడే ఈయన బిగ్ స్క్రీన్ పై బూతు ప్రదర్శిస్తే తప్పేముంది.. కోట్ల మంది దానిని కోరుకుంటున్నారు కదా అంటూ సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమ్మాయిల గురించి మరింత బూతుగా మాట్లాడే వర్మ .. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై బూతులు ప్రదర్శించడం గురించి తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
సెన్సార్ ఒక స్టుపిడ్ అంటున్న వర్మ..
వర్మ మాట్లాడుతూ..” ప్రస్తుతం వున్న ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ యాక్సిస్ తో జస్ట్ ఒక క్లిక్ దూరంలోనే రియల్ లైఫ్ వయలెన్స్, బూతులు అందుబాటులో ఉంటాయి. అలాంటప్పుడు చిన్నచిన్న ఇలా బూతు పదాలను మూవీ నుంచి ఎందుకు కట్ చేయాలి అంటూ ప్రశ్నించాడు ఎంటర్టైన్మెంట్ ను రిస్ట్రిక్ట్ చేయడంలో అసలు సెన్స్ ఉందా..? సెన్సార్ బోర్డు ఒక స్టుపిడ్ అని విమర్శించారు. అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని ఐదుగురు సభ్యులు కోట్ల మంది కోరుకునే ఎంటర్టైన్మెంట్ ను ఎలా డిసైడ్ చేయగలరు అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వర్మపై ఎప్పటిలాగే నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయనపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.
వర్మపై నెటిజన్స్ ఫైర్..
ప్రస్తుతం వర్మ కి సంబంధించిన ఈ పాడ్ కాస్ట్ వీడియో వైరల్ గా మారడంతో.. ఇది చూసిన చాలామంది మీ ఉద్దేశం ఏమిటి..? థియేటర్లలో బూతు సినిమాలు చూడాలా? సీక్రెట్ గా చూసే బూతు సన్నివేశాలను 70mm స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేయాలా? ఇలా చూసే కదా చిన్నపిల్లలు కూడా రేపిస్టులుగా మారుతున్నారు.. హత్యలు చేస్తున్నారు.. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది..సమాజం పూర్తిగా చెడిపోతోంది.. ముఖ్యంగా మియా మాల్కోవా షార్ట్ ఫిలిమ్స్ ని మీ తల్లితో కలిసి చూడగలవా.. డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయి కదా అని వాటిని వాడి పాడైపొమ్మని చెబుతున్నావా ? అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు .ఇక వర్మపై ఇప్పుడు అడుగడుగునా వ్యతిరేకత నెలకొంది అని చెప్పవచ్చు. ఒక ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో భారీగా వ్యతిరేకతను కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న వ్యతిరేకతకు వర్మ ఎలాంటి సమాధానాన్ని చెబుతారో చూడాలి. రాంగోపాల్ వర్మ సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు క్షణక్షణం, శివ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బూతు చిత్రాలు తెరకెక్కిస్తూ తన ఇమేజ్ను కించపరుచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలే మాట్లాడి మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
also read:Chiranjeevi: డైరెక్టర్ బాబీకి చిరు స్పెషల్ సర్ప్రైజ్.. ఖరీదు ఎంతో తెలుసా..?
"The Censor Board is outdated and the stupidest thing ever.
When porn and real-life violence are just a click away, restricting entertainment makes no sense!
How can five people decide for crores?"
— #RGV on #RawTalksWithVK!! pic.twitter.com/jmbdjk65Ho
— Movies4u Official (@Movies4u_Officl) May 22, 2025